ప్రభాస్-పూజా హెగ్డే.. ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లమ్?

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీళ్లిద్దరికి సంబంధించి ఊహాగానాలు చెలరేగాయి. అందరితో డార్లింగ్ అనిపించుకునే ప్రభాస్ తో, పూజా హెగ్డేకు పడడం లేదంటూ పుకార్లు వినిపించాయి. ఒక దశలో పూజాహెగ్డే షూటింగ్ కు…

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీళ్లిద్దరికి సంబంధించి ఊహాగానాలు చెలరేగాయి. అందరితో డార్లింగ్ అనిపించుకునే ప్రభాస్ తో, పూజా హెగ్డేకు పడడం లేదంటూ పుకార్లు వినిపించాయి. ఒక దశలో పూజాహెగ్డే షూటింగ్ కు కూడా డుమ్మా కొట్టిందంటూ గాసిప్స్ వచ్చాయి. అప్పటి ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఉంది ప్రస్తుతం ప్రభాస్-పూజాహెగ్డే వ్యవహార శైలి.

రాధేశ్యామ్ ప్రచారం మొదలైనప్పట్నుంచి ప్రభాస్, పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మొదటి రోజు నుంచి వీళ్లిద్దరు ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం, నవ్వుకోవడం లాంటివి చేయడం లేదు. కనీసం ఫొటోలకు పోజులిచ్చినప్పుడు కూడా చేయిచేయి కలపకపోవడం విడ్డూరం.

ముంబయి ఈవెంట్ నుంచి రాత్రి జరిగిన చెన్నై ఈవెంట్ వరకు ఎక్కడా ప్రభాస్-పూజా సన్నిహితంగా ఉన్నట్టు కనిపించలేదు. పూజా హెగ్డే తన పక్కన లేనట్టే వ్యవహరిస్తున్నాడు ప్రభాస్. అటు పూజా కూడా తప్పదన్నట్టు ప్రభాస్ పక్కన కూర్చుందేమో అనిపిస్తోంది. ఈ పుకార్లను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేలా నిన్న ఓ ఘటన జరిగింది.

చెన్నై ప్రెస్ మీట్ కు ప్రభాస్ హాజరయ్యాడు. అప్పటికే సత్యరాజ్, పూజా హెగ్డే అక్కడకు చేరుకున్నారు. సత్యరాజ్ ను కౌగిలించుకున్న ప్రభాస్, ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అదే టైమ్ లో సత్యరాజ్, పూజా హెగ్డేను కూడా రమ్మని ఆహ్వానించాడు. ఆ మొత్తం సీన్ లో పూజాహెగ్డే కాస్త సంకోచిస్తూ ముందుకురావడం, ప్రభాస్ అసహనంగా కదలడం, పక్కకు ఓ 2 అడుగులు వేయడం స్పష్టంగా కనిపించింది.

కేవలం ఇది మాత్రమే కాదు, ముంబయిలో జరిగిన ఫొటో సెషన్ లో కూడా ఇదే తంతు. కనీసం పూజాహెగ్డే భుజంపై చనువుగా చేయి కూడా వేయలేదు ప్రభాస్. ఇక ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి ఒకరు స్పందించే క్రమంలో ముక్తసరి సమాధానాలతోనే సరిపెట్టారిద్దరూ.

మామూలుగానే హీరోయిన్లకు దూరంగా ఉంటాడు ప్రభాస్. కానీ పూజాహెగ్డేతో మెయింటైన్ చేస్తున్నంత దూరం మాత్రం ఎప్పుడూ చూడలేదు. అంతెందుకు, సాహో ప్రమోషన్ టైమ్ లో హీరోయిన్ శ్రద్ధ కపూర్ తో బాగానే ఉన్నాడు ప్రభాస్. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు, జోకులేసుకున్నారు. ఆ మాత్రం చనువును కూడా పూజాహెగ్డే విషయంలో ప్రదర్శించలేకపోయాడు ప్రభాస్.