క్రిష్ ను ఫాలో అవ్వబోతున్న హరీశ్ శంకర్?

పవన్ కల్యాణ్ లైనప్ మరోసారి మారేలా కనిపిస్తోంది. భీమ్లానాయక్ రాకతో హరిహర వీరమల్లు సినిమా వెనక్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు మరో సినిమా రాకతో హరీశ్ శంకర్ సినిమా వెనక్కు జరిగేలా…

పవన్ కల్యాణ్ లైనప్ మరోసారి మారేలా కనిపిస్తోంది. భీమ్లానాయక్ రాకతో హరిహర వీరమల్లు సినిమా వెనక్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు మరో సినిమా రాకతో హరీశ్ శంకర్ సినిమా వెనక్కు జరిగేలా ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లిస్ట్ లో 2 రీమేక్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. వీటిలో కనీసం ఒకటి ఫైనలైజ్ అయినా, హరీశ్ శంకర్ తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా వెనక్కి వెళ్లినట్టే. మరి హరీశ్ శంకర్ ఏం చేస్తాడు?

పవన్ కల్యాణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు హరీశ్ శంకర్. ఎప్పటికప్పుడు తను రాసుకున్న స్క్రిప్ట్ లో మార్పుచేర్పులు చేసుకుంటూ మరింత మెరుగుపరుచుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు హరీశ్ వెయిటింగ్ పీరియడ్ టైమ్ పెరిగిపోతూనే ఉంది. తాజాగా వినోదాయ శితం రీమేక్ తెరపైకి రావడంతో హరీశ్ గుండెలో రాయి పడింది.

రీమేక్స్ వద్దు బాబోయ్ అంటూ ఓవైపు ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నప్పటికీ మరోవైపు పవన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే, అటువైపు నుంచి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ రెడీగా ఉంది మరి. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. పవన్ కోసం సుదీర్ఘంగా అతడు వెయిట్ చేస్తాడా లేక క్రిష్ మార్గాన్ని అనుసరిస్తాడా అనేది చూడాలి.

భీమ్లానాయక్ రాకతో హరిహర వీరమల్లు సినిమా లేట్ అవుతుందని గ్రహించిన వెంటనే కొండపొలం సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు క్రిష్. పవన్ అనుమతితో, ఆ సినిమాను అతి తక్కువ టైమ్ లో పూర్తిచేశాడు. అక్కడ హీరోగా పవన్ మేనల్లుడే ఉన్నాడు కాబట్టి పర్మిషన్ ఈజీగా వచ్చింది. మరి హరీశ్ శంకర్ కూడా అలా స్పెషల్ పర్మిషన్ తీసుకొని బయటకెళ్తాడా లేక ఇంట్లోనే కూర్చుంటాడా అనేది చూడాలి.

ఇప్పటికే జీ5కు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు హరీశ్ శంకర్. అలాంటిదే మరో ప్రాజెక్టు టేకప్ చేస్తాడా లేక కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.