అది ఫేక్ న్యూస్ … నేను ఖాళీ చేస్తాను

కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, రాహుల్ గాంధీ సోదరి అయిన ప్రియాంక గాంధీకి ఈ నెలాఖరువరకు గడువు ఇచ్చింది కదా. గడువు ఎందుకంటారా ? ఢిల్లీలో ఆమె ఉంటున్న ఇల్లు…

కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, రాహుల్ గాంధీ సోదరి అయిన ప్రియాంక గాంధీకి ఈ నెలాఖరువరకు గడువు ఇచ్చింది కదా. గడువు ఎందుకంటారా ? ఢిల్లీలో ఆమె ఉంటున్న ఇల్లు ఖాళీ చేయడానికి. జులై 31 తరువాత ఆమె ఆ ఇంట్లో కనబడకూడదు.

లోధీ ఎస్టేట్ లోని ఇంటి నెంబర్ 35 లో ప్రియాంకా గాంధీ ఉంటున్నారు. ఆమె ఆ ఇంట్లో ఉండబట్టి చాలా ఏళ్లయింది. మరి ఎందుకని ఖాళీ చేయమన్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల భద్రతకు సంబంధించిన రూల్స్ మార్చింది కాబట్టి. రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన కుటుంబానికి అంటే సోనియా, రాహుల్, ప్రియాంకలకు అప్పటి ప్రభుత్వం ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ) భద్రత కల్పించింది.

ఉగ్రవాదుల నుంచి ఆ కుటుంబానికి ముప్పు ఉందనే ఉద్దేశంతో అంత టాప్ సెక్యూరిటీ కల్పించిందన్నమాట. ఎస్పీజీ భద్రత ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ నివాసం ఇస్తారు. మారిన రూల్స్ ప్రకారం ప్రియాంకకు ఎస్పీజీ భద్రత తొలగించారు. ఇంతకూ రూల్స్ ఏ విధంగా మార్చారు ? ఎస్పీజీ భద్రత అధికారంలో ఉన్న ప్రధానికి అధికారంలో ఉన్నంత కాలం ఉంటుంది.

మాజీ ప్రధానుల కుటుంబాలకు అయిదేళ్ల పాటు ఇస్తారు. గాంధీ కుటుంబం ఈ రెండు కేటగిరీల్లో లేదు కాబట్టి ఎస్పీజీ భద్రత తీసేశారు. సో …దీంతో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడమే కాకుండా, మూడు లక్షల చిల్లర బకాయి ఉందట. అది కూడా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ డబ్బు ప్రియాంక చెల్లించేశారు.  ప్రియాంక ఒకవేళ ఆగస్టు  ఒకటో తేదీ తరువాత కూడా కొనసాగితే డామేజ్ చార్జీలు, పెనాల్టీ రెంట్ కట్టాలని ప్రభుత్వం తెలియచేసింది.

ఈ నేపథ్యంలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఏమిటది ? ఇప్పుడున్న ఇంట్లోనే తాను మరి కొంతకాలం  కొనసాగుతానని, ఇందుకు అంగీకరించాలని ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారని, అందుకు ఆయన దయతో అంగీకరించారని ఓ వార్త హల్చల్ చేసింది. మాజీ ప్రధాని కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తున్నదనే అభిప్రాయం కలుగుతుందనే ఉద్దేశంతో ప్రియాంకను ప్రధాని మోడీ అదే ఇంట్లో కొనసాగాలని చెప్పారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని మీడియా ఆమె దృష్టికి తీసుకెళ్లినప్పుడు అది  అబద్ధపు ప్రచారమని కొట్టి పారేశారు.

ప్రధానికి తాను ఎలాంటి అభ్యర్థన చేయలేదని క్లియర్ గా చెప్పేశారు. ప్రభుత్వం పెట్టిన గడువులోగానే తాను కచ్చితంగా ఇల్లు ఖాళీ చేస్తానని అన్నారు. ప్రియాంక యూపీకి వెళ్లాలనుకుంటోంది కాబట్టి కొంత సామాను ఇప్పటికే అక్కడికి తరలించేశారు. ఇకనుంచి ప్రియాంక యూపీ నుంచి బీజేపీపై పోరాటం సాగిస్తారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తేవడమే ఆమె లక్ష్యం. 

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు

విశాఖ ఫార్మాసిటీ లో భారీ అగ్నిప్రమాదం