తగ్గేదేలే.. బుల్లితెరపై కూడా అదే ప్రభంజనం

తగ్గేదేలే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప పార్ట్-1 సినిమాలో సూపర్ హిట్ డైలాగ్ ఇది. దీనిపై లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. క్రికెటర్లు సైతం దీన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ…

తగ్గేదేలే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప పార్ట్-1 సినిమాలో సూపర్ హిట్ డైలాగ్ ఇది. దీనిపై లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. క్రికెటర్లు సైతం దీన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ హిట్ డైలాగ్ ను రిపీట్ చేసుకోవచ్చు. అవును.. టీఆర్పీల్లో కూడా పుష్ప సినిమా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోయింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పుష్ప సినిమాకు రికార్డ్ స్థాయిలో 22.5 రేటింగ్ వచ్చింది. బార్క్ అమల్లోకి వచ్చిన తర్వాత టాప్-5 రేటింగ్స్ లో ఇది కూడా ఒకటి. ఇంతకుముందు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు ఏకంగా 29.4 టీఆర్పీ వచ్చింది. 

మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఫస్ట్ ఎయిరింగ్ లో 23.4 రేటింగ్ వచ్చింది. వకీల్ సాబ్ కు 19.2, ఉప్పెనకు 18, క్రాక్ కు 11.66 టీఆర్పీలు వచ్చాయి. అలా టాప్-5 రేటింగ్స్ లో బన్నీ నటించిన 2 సినిమాలు చోటు సంపాదించుకున్నాయి.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నార్త్ లో కూడా సంచలన విజయం సాధించింది. దీంతో పార్ట్-2పై యూనిట్ మరింత శ్రద్ధ పెంచింది. మొదటి భాగాన్ని విడుదల చేయడానికి టైమ్ సరిపోకపోవడంతో టెక్నికల్ గా తప్పులు దొర్లాయి. గ్రాఫిక్స్ పై కూడా విమర్శలు చెలరేగాయి. రెండో భాగం విషయంలో అలాంటివి జరగకుండా ఉండేందుకు, పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. పనిలోపనిగా ఈసారి బాలీవుడ్ నటీనటులకు కూడా చోటివ్వాలని చూస్తున్నారు.

లెక్కప్రకారం పుష్ప పార్ట్-2 ఈ ఏడాదిలోనే రిలీజ్ అవ్వాలి. డిసెంబర్ లో విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు కూడా. కానీ మరోసారి హడావుడిగా పరుగులు పెట్టేబదులు, నిదానంగా, మంచి క్వాలిటీతో సినిమాను అందించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనే టార్గెట్ ను పక్కనపెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరినాటికి పుష్ప-2 వస్తుంది, లేకపోతే వచ్చే ఏడాది రిలీజ్.