చంద్రబాబు తీరు పక్క రాష్ట్రనేతకు ఇప్పుడర్థమైంది!

ఎన్నిమాటలు చెప్పారు.. ఎన్ని కథలు చెప్పారు.. తను సైకిల్ కు ఓటేస్తే ఫ్యాన్ కు పడిందని చెప్పిన ఏకైక ఓటర్ చంద్రబాబు నాయుడు మాత్రమే! రాష్ట్రంలో ఏ ఒక్కరూ, ఆఖరికి టీడీపీ వీరాభిమానులు కూడా…

ఎన్నిమాటలు చెప్పారు.. ఎన్ని కథలు చెప్పారు.. తను సైకిల్ కు ఓటేస్తే ఫ్యాన్ కు పడిందని చెప్పిన ఏకైక ఓటర్ చంద్రబాబు నాయుడు మాత్రమే! రాష్ట్రంలో ఏ ఒక్కరూ, ఆఖరికి టీడీపీ వీరాభిమానులు కూడా ఆ మాట అనలేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రమే ఈవీఎంలతో మోసం జరుగుతోందని, సైకిల్ కు ఓటేస్తే ఫ్యాన్ కు పడుతోందని అన్నారు. ఈవీఎంల మీద పోరాటం అన్నారు! ఎన్నికలకు ఐదారు నెలల ముందే దాన్ని మొదలుపెట్టారు. కోర్టుకు ఎక్కారు. బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేయించాలన్నారు, వీవీ ప్యాట్ లు వచ్చినా సంతోషం లేదన్నారు.

వీవీ ప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించాలని కోర్టుకు ఎక్కారు. ఒకటికి పదిసార్లు పిటిషన్లు వేసి, చివరకు శాంపిల్స్ గా కొన్నింటిని లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కువచ్చారు! ఎన్నికల ముందు, పోలింగ్ రోజున కూడా చంద్రబాబు నాయుడు ఆ రేంజ్ లో పోరాడారు. ఆ విషయంలో మోడీని, బీజేపీని, జగన్ ను ఇష్టానుసారం విమర్శించారు. అదేంటో మరి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు మారు మాట్లాడటం లేదు!

ఈవీఎంలతో మోసం జరిగిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనడంలేదు! అలా ఎందుకు అనడం లేదో.. సామాన్యులు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు గనుక చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద స్పందిస్తే అంతే సంగతులు. ఎన్నికల ముందంటే ఎలాగూ మోడీ రాడు అని బలంగా ఫిక్సయి ఈవీఎంల మీద బురద జల్లేయత్నం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంలు అంటే కేంద్రంలో కూర్చున్న మోడీ ఊరికే ఉండరు కదా.. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈవీఎంల మీద కిక్కురుమనడం లేదని సామాన్యులు అనుకుంటున్నారు.

అయితే చంద్రబాబు నాయుడులోని ఈ టాలెంట్ మహారాష్ట్ర రాజకీయ నేత రాజ్ ఠాక్రేకు అర్థం అయినట్టుగా లేదు. ఈవీఎంపై పోరాడాలని ఆయన అనుకుంటున్నారట. ఈ విషయంలో అందరినీ కలుపుకుపోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. అందుకోసమని ఎన్నికల ముందు ఈవీఎంల మీద తెగపోరాడిన చంద్రబాబు నాయుడును సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారట ఠాక్రే. అయితే చంద్రబాబు నాయుడు ఫోన్ ఎత్తడం లేదట!
పలుసార్లు తను ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ఫోన్ కు అందలేదని ఠాక్రే వాపోతున్నారిప్పుడు.

అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఇష్యును వదిలేశారని, దానిగురించి మాట్లాడితే మోడీతో మరింత శత్రుత్వం పెరిగిపోతుందనే భావనతో చంద్రబాబు నాయుడు కామ్ అయిపోయారని రాజ్ ఠాక్రేకు ఎవరు చెబుతారో పాపం. చంద్రబాబు నాయుడు మిత్రుత్వాలు, శత్రుత్వాలు అవసరానికి అనుగుణంగా మారిపోతుంటాయి, ఆ మేరకు ఆయన విధానాలు, పోరాటాలు కూడా మారిపోతూ ఉంటాయని ఆ మహారాష్ట్ర వ్యక్తి ఎవరైనా వివరించాలి పాపం! అయితే చంద్రబాబు ఇదివరకటి చరిత్రను గమనిస్తే మాత్రం ఆయనే అర్థం చేసుకోగలరు!

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!