సై… సైరా టీజర్

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రెండు భారీ సినిమాల్లో ఒకటైనా సాహో టీజర్, ట్రయిలర్ ఇప్పటికే బయటకు వచ్చాయి. జనానికి నచ్చాయి. లేటెస్ట్ గా ఇప్పడు సైరా నరసింహారెడ్డి టీజర్ విడదులయ్యింది.…

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రెండు భారీ సినిమాల్లో ఒకటైనా సాహో టీజర్, ట్రయిలర్ ఇప్పటికే బయటకు వచ్చాయి. జనానికి నచ్చాయి. లేటెస్ట్ గా ఇప్పడు సైరా నరసింహారెడ్డి టీజర్ విడదులయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినీకీరీర్ లోనే అత్యంత భారీ సినిమాగా దాదాపు 250 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణమైన సినిమా టీజర్ బయటకు వచ్చింది.

టీజర్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయింది.  టీజర్ లో సినిమా క్వాలిటీ, స్పాన్, రేంజ్, ఖర్చు అన్నీ క్లియర్ గా తెలిసేలా వున్నాయి.

సినిమాకు చేసిన ప్రొడక్షన్ వర్క్ అంతా టాప్ రేంజ్ లో వుంది. యాక్షన్ సీక్వెన్స్ ల దగ్గర ఎక్కడా రాజీపడలేదని కనిపిస్తోంది. అయితే టీజర్ లో మెగాస్టార్ కట్ లు అన్నీ దాదాపు ఒకే యాక్షన్ సీన్ లోంచి తీసినవిగా వున్నాయి. అమితాబ్, జగపతిబాబు, సుదీప్, నయనతార ఇలా అందరినీ ఎట్ ఎ గ్లాన్స్ టీజర్ లో చూపించారు.

మేకింగ్ వీడియోలో కన్నా చిరంజీవి ఈ టీజర్ లో బాగానే వున్నారు. మొత్తంమీద సైరా మీద అంచనాలు పెంచుతుందే తప్ప, తగ్గించేలా ఏమీలేదు టీజర్.

సైరా టీజర్ కోసం క్లిక్ చేయండి

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!