రాజధాని ప్రక్షాళన.. జగన్ మరో ముందడుగు

చంద్రబాబు సృష్టించిన భ్రమరావతిని, అమరావతిగా మార్చేందుకు జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో కీలక మార్పులు చేసి ఇప్పటికే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్, ఇప్పుడు అమరావతికి సంబంధించి మరో కీలక…

చంద్రబాబు సృష్టించిన భ్రమరావతిని, అమరావతిగా మార్చేందుకు జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో కీలక మార్పులు చేసి ఇప్పటికే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్, ఇప్పుడు అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వైద్య సంస్థలకు ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేశారు.

ఆలూ లేదు, చూలు లేదు అన్నట్టు.. రాజధానికి ఇటుక కూడా వేయకముందే రెండు వైద్య సంస్థలకు అప్పట్లో భూములు కేటాయించారు చంద్రబాబు. అది కూడా మామూలుగా కాదు. బీఆర్ షెట్టికి చెందిన వైద్య సంస్థకు ఏకంగా వంద ఏకరాలు కట్టబెట్టారు. ఇండోయూకే అనే మరో వైద్య సంస్థకు 50 ఎకరాలు ధారాదత్తం చేశారు. అది కూడా తొలి దశలో భాగంగానే. మలి దశల్లో మరింత భూమిని కేటాయిస్తామంటూ అప్పట్లో చంద్రబాబు జీవో విడుదల చేశారు. అయితే జీవో విడుదల చేసి మూడేళ్లయినా ఈ రెండు సంస్థలు, రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. అందుకే నిబంధనల ప్రకారం, వాటికి కేటాయించిన భూముల ఉత్వర్వుల్ని ప్రభుత్వం రద్దుచేసింది.

రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ఎలాంటి నిష్పక్షపాతాలకు, అవినీతికి తావులేకుండా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. మరీ ముఖ్యంగా వనరుల పరిమితుల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతిపాదిత టవర్లలో బహుళ అంతస్తుల స్థానంలో నిర్ణీత అంతస్తులకు పరిమితం చేశారు. ఒరిజినల్ ప్లాన్ లో ఒక్కొక్క టవర్ లో 25 అంతస్తులుండగా, వాటిని 10 అంతస్తులకే కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ప్లాన్ లో ఉన్న 5 టవర్లు కాకుండా, ప్రస్తుతానికి 2 టవర్లు మాత్రమే కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిధులు కూడా కేటాయించారు.

కరకట్ట ప్రాంతంలో అక్రమ కట్టడాలపై ఇప్పటికే కొరడా ఝలిపించిన జగన్.. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ తో పాటు మిగతా ప్రాంతాల్లోని భూములపై కూడా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే వైద్య సంస్థలకు కేటాయించిన భూముల్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 2023 నాటికి 2 టవర్లను పూర్తిచేయడంతో పాటు.. ఆ టైమ్ కు వైద్య సంస్థల్ని అందుబాటులోకి తీసుకొచ్చే కంపెనీలకు మాత్రమే భూముల్ని కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.