నాలుగు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ ఆధిపత్యం కోసం, టీఆర్ఎస్ ను ఎదురుదెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటడం కోసం, ఇక తామూ ఉన్నట్టుగా అనిపించడానికి తెలుగుదేశం పార్టీ.
వీటిల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే అనే ప్రచారం సాగుతూ ఉంది. నోట్ల పంపకంలో కూడా ఆ పార్టీలు పోటీ పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓటుకు ఐదు వందల రూపాయలు, వెయ్యి మొదలుకుని.. రెండు వేల రూపాయల వరకూ పంచుతున్నారని సమాచారం. ఎలాగైనా గెలుపును అందుకోవాలని పార్టీలు ధీటుగా పంచుతున్నాయని టాక్.
ఇక ఈ విషయంలోతెలుగుదేశం పార్టీ కూడా తీసిపోవడం లేదట. ఆ పార్టీ కూడా పంపకాల వ్యవహారంలో తమదైన శైలిని కొనసాగిస్తూ ఉందనేది హుజూర్ నగర్ నుంచి వినిపిస్తున్న మాట. గెలుపు మీద ఎలాంటి ధీమా లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్లు పంచుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇది తెలంగాణ వరకూ ఖరీదైన ఉప ఎన్నిక అనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనలను రాజకీయాల పార్టీలు యథారీతిన తుంగలో తొక్కి, ఓటుకు నోటుతో ఖర్చులను పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయని సామాజిక పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రచార పర్వం ముగిసిన సాగుతున్న పంపకాల పర్వం పట్ల ఆశ్చర్యపోతూ ఉన్నారు.