అత్యద్భుతంగా రాములోరి ఆలయం

శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. సకల లోకాలకు ఇలవేలుపు. ఆయనకు కావాల్సినవి అలా జరిపించుకుంటాడు కూడా. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఓ దుర్ఘటన ఏకంగా రామతీర్ధం రూపు రేఖలనే మార్చేసింది. చివరికి అది సర్వ…

శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. సకల లోకాలకు ఇలవేలుపు. ఆయనకు కావాల్సినవి అలా జరిపించుకుంటాడు కూడా. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఓ దుర్ఘటన ఏకంగా రామతీర్ధం రూపు రేఖలనే మార్చేసింది. చివరికి అది సర్వ శుభంగా పరిణమించింది.

విజయనగరం జిల్లా రామతీర్ధాలులో కొండపైన కొలువు తీరిన కోదండరామస్వామి వారి ఆలయంలోని విగ్రహాన్ని నాడు దుండగులు విరగగొట్టారు. దాని మీద జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు, ఏకంగా ప్రత్యేక విమానంలో చంద్రబాబు వచ్చారు. ఇక టీడీపీ ఆద్వర్యంలో జరిగిన ఆందోళనలతో నాడు రామతీర్ధం ప్రాంతం అంతా ఉద్రిక్తల మయం అయింది.

అయితే వైసీపీ సర్కార్ చాలా సమయస్పూర్తిగా చాకచక్యంగా వ్యవహరించింది. అతి సున్నితమైన సమస్యను రాజకీయం చేయాలని చూసినా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ సహనమే పాటించారు. ఇక జగన్ ప్రభుత్వం ఏకంగా కొత్త ఆలయన నిర్మాణం కోసం మూడు కోట్ల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించింది.

నిధులు సాఫీగా  విడుదల కావడంతో భవ్యమైన రాముల వారి ఆలయం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. కొండమీద ఆలయ నిర్మాణం కావడంతో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తున్నారు. పూర్తిగా రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ఆలయాన్ని తాజాగా సందర్శించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జనవరి నాటి నిర్మాణం పూర్తి చేసుకుంటుందని చెప్పారు. ఒక బ్రహ్మాండమైన ముహూర్తాన రాముల వారి ఆలయం ప్రారంభిస్తామని చెప్పడం ద్వారా ఆస్తిక జనుల మదిలో ఎనలేని ఆనందాన్ని నింపారు.