కరోనా బాదితులను భయపెట్టి విజయవాడ రమేష్ ఆస్పత్రి లక్షల్లో డబ్బు వసూలు చేసిందని అదికారులు గుర్తించారు.
దీనిపై కరోనా బాదితులు పలువురు దర్యాప్తు చేసిన అధికారుల కమిటీకి వాంగ్మూలం ఇచ్చారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని సమాచారం.
స్వర్ణపాలెస్ హోటల్ అగ్ని ప్రమాదంలో పది మంది మరణించిన ఘటనకు సంబందించి ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రమేష్ ఆస్పత్రి, హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది.
కరోనా పేషంట్లకు హోటల్ లో బస ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతి పొందారో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం తెలియచేయాలని పోలీసులు చెబుతున్నారు.
అవసరం లేకపోయినా, ఖరీదైన మందులను బాదితులకు ఇచ్చారన్న అబియోగాలు కూడా వచ్చాయి.
కాగా డాక్టర్ రమేష్ బాబు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయన పోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారని అంటున్నారు. నాలుగు రాష్ట్రాలలో ఆయనకోసం గాలిస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.