చేసిన సినిమాలు తక్కువే అయినా, డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ హీరో నాగార్జునకు పర్సనల్ చాయిస్ గా మారారు. మీలో ఎవరు కోటీశ్వరుడు దగ్గర నుంచి బిగ్ బాస్-3 ప్రోమోలు అన్నీ కళ్యాణ్ కృష్ణ రూపొందించినవే. అందుకే బిగ్ బాస్ 4 కు కూడా నాగ్ అతనినే రంగంలోకి దింపాడు. నిన్నటికి నిన్న నాగ్ ను మూడు క్యారెక్టర్లలో చూపిస్తూ తయారైన ప్రోమో కళ్యాణ్ కృష్ణ రూపొందించినదే. బిగ్‌బాస్ నాలుగో సీజన్ సెప్టెంబర్ తొలి వారం నుంచీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ప్రచారంలో భాగంగా నాగార్జున చేసిన మూడు పాత్రలు – తాతయ్య, కొడుకు, మనవడు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అన్ని వయసుల వారిని అలరిస్తుందని, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడే జనాల ఉత్సాహానికి కాస్త హాస్యాన్ని జోడించి రూపొందించిన ప్రచార చిత్రమిది.
ఇదిలా వుంటే ప్రచార చిత్రంలో తన లుక్ గురించి నాగార్జున మాట్లాడుతూ మూడు పాత్రలు చేయడం, పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజీ మెయిన్ చేయడం, వాయిస్‌లో జాగ్రత్తలు, మేనరిజంలో వైవిధ్యం చూసుకుంటూ– అదీ తక్కువ సమయంలో షూట్ చేయడం పెద్ద ఛాలెంజ్. కానీ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. జీవితం, ఆశ, వినోదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని నేను నమ్ముతున్నాను. అని అన్నారు.