ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని స్వచ్ఛంద సంస్థల జాబితాను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ విడుదల చేయగా, ఆ జాబితాలో ఉన్న ఒక సంస్థ వైఎస్ కుటుంబానికి చెందినదంటూ టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్ కు చెందిన వెబ్ సైట్ ప్రచారం చేయడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.
దున్న ఈనింది అంటే గాడిన కట్టెయ్ అన్నట్టుగా కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయని ఆ వర్గాలు మండిపడుతూ ఉన్నాయి. ఈ మేరకు ఒక ఖండన ప్రకటన విడుదల అయ్యింది. ఇందులో అసలు కథ ఏమిటంటే.. రిటర్న్స్ ఫైల్ చేయని స్వచ్ఛంద సంస్థల్లో వైఎస్ విజయమ్మ ట్రస్ట్ అనేది ఒకటి ఉన్నట్టుగా ఐటీ శాఖ ప్రకటించింది.
తణుకులో ఎవరో ఒక ఆ పేరుతో ఒక సంస్థను రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రముఖుల పేరుతో చాలా మంది ట్రస్టులు రిజిస్టర్ చేయించుకుంటూ ఉంటారు. దేశంలోని చాలా మంది ప్రముఖుల పేరుతో వారికి సంబంధం లేని వారు ట్రస్టులు నడుపుతున్న దాఖలాలు ఉంటాయి.
ఈ ప్రాథమిక విజయాన్ని గ్రహించ రవి ప్రకాష్ పచ్చకళ్లద్దాల వెబ్ సైట్ ఆ ట్రస్టు వైఎస్ విజయమ్మది అన్నట్టుగా రాసేసింది. వారు రిటర్న్స్ ఫైల్ చేయనట్టుగా ప్రచారం చేస్తూ ఉంది. ఆ ట్రస్టు ఎవరిదనే ప్రాథమిక విషయాన్ని కూడా గ్రహించకుండా ఇలా తప్పుడు ప్రచారం చేయడం పై వైసీపీ వర్గాలు చట్టపరమైన చర్యలకు సిద్ధం అయ్యాయని తెలుస్తోంది.
దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. అనునిత్యం వైఎస్ కుటుంబం గురించి ఏదోలా అక్కసు గక్కడమే పనిగా పెట్టుకున్న కొంతమంది తమ అసహంతో తామే దొరికిపోతూ ఉన్నారు.