70 ఏళ్ల క‌ల కాసు నేతృత్వంలో సాకారం

ఒక‌టి కాదు, రెండు కాదు…ఏకంగా 70 ఏళ్ల ప‌ల్నాటి క‌ల గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి నేతృత్వంలో సాకార‌మ‌వుతోంది. ఇందులో భాగంగా మొద‌టి అడుగు ప‌డింది. పల్నాడు వాసులు ఎప్పటి నుంచో తమ ప్రాంతంలో…

ఒక‌టి కాదు, రెండు కాదు…ఏకంగా 70 ఏళ్ల ప‌ల్నాటి క‌ల గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి నేతృత్వంలో సాకార‌మ‌వుతోంది. ఇందులో భాగంగా మొద‌టి అడుగు ప‌డింది. పల్నాడు వాసులు ఎప్పటి నుంచో తమ ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తాను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, 70 ఏళ్లుగా ఎదురు చూస్తున్నవైద్య శాల‌ను ఎట్ట‌కేల‌కు మంజూరు చేయించారు. అంతేకాదు, నేడు (30వ తేదీ) సీఎం వైఎస్ జ‌గ‌న్‌ ప‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేయ‌డం విశేషం. సుమారు 500 కోట్ల ఖ‌ర్చుతో నిర్మించనున్న ఈ వైద్య కళాశాలలో దాదాపు గా వెయ్యి పడకలు ఉంటాయి. ఏటా దాదాపు 500 మంది విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే మ‌హావ‌కాశాన్ని కాసు మ‌హేష్‌రెడ్డి చొర‌వ‌తో ద‌క్కించుకోనున్నారు.

త‌న తండ్రి వైఎస్సార్ హ‌యాంలో 2008లో ఏకంగా నాలుగు వైద్య క‌ళాశాల‌ల నిర్మాణానికి శ్రీ‌కారం చుడితే, జ‌గ‌న్ ఏకంగా నాలుగు రెట్లు అంటే 16 వైద్య క‌ళాశాల‌ల‌ను నిర్మించే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. 

నాడు వైఎస్సార్ రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) పేరిట శ్రీకాకుళం, ఆదిలాబాద్, ఒంగోలు, కడప ప్రాంతాల్లో ఒక్కో కళాశాలకు రూ.250 కోట్ల చొప్పున వెచ్చించి ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో ప్ర‌తి జిల్లాకు ఒక‌టి చొప్పున , అలాగే మూడు అద‌నంగా వైద్య క‌ళాశాల‌లు, వైద్య‌శాల‌లు ఏర్పాటు చేస్తుండ‌డం విశేషం.

మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, నరసరావు పేట, వినుకొండ ప్రాంతాల వాసులు వైద్యసేవల కోసం ఎక్కువగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వర్కర్లు విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరికి ఏ అనారోగ్యం దరిచేరినా గుంటూరు పెద్దాసుపత్రే దిక్కు. వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జిల్లా కేంద్రానికి రావడం వీరికి వ్యయ ప్రయాసలతో కూడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అ ప్రాంతంలో తమకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

ముఖ్యంగా గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, మాచర్ల మండలాల ప్రజలకు కొత్త‌గా నిర్మించే వైద్య శాల ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రం. బెల్లంకొండ, రాజుపాలెం తదితర మండలాలు నైసర్గికంగా గుంటూరు డివిజన్‌ పరిధిలో ఉన్నప్పటికీ ఇవి పిడుగురాళ్లకు దగ్గరగా ఉంటాయి. ఈ రెండు మండలాలతోపాటు క్రోసూరు, రాజుపాలెం, అచ్చంపేట తదితర మండల ప్రజలకు సైతం గురజాలలో ఏర్పాటు చేసే బోధ‌న ఆసుపత్రి సౌలభ్యంగా ఉంటుంది.

సమీప భవిష్యత్తులో గురజాలలో వైద్య కళాశాల, అనుబంధ బోధన ఆసుపత్రి ఏర్పాటు అయితే పల్నాడువాసులకు ప్రయోనక రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి వైద్య కళాశాలను మంజూరు చేయడంపై ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పల్నాడు ప్రాంతలో పుట్టిన ఒకే కుటుంబంలోని ఇద్దరు నేత‌లు సేవా దృక్ప‌థం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 

మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించిన గొప్ప వ్య‌క్తి. ఆయ‌న మ‌నుమ‌డిగా రాజ‌కీయ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కాసు మ‌హేష్‌రెడ్డి అదే స్ఫూర్తితో ప‌నిచేయ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.  విద్యావంతుడు, యువకుడు, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌ప‌న ఉన్న‌డాడు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మున్ముందు మ‌రెన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల ఆశీస్సులు అందించాల్సి వుంది.