రేవంత్ కు బెయిల్.. స‌గం శిక్షాకాలం సైతం పూర్తి!

మొత్తానికి రేవంత్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్న‌ట్టుగా ఉన్నారు. ఎప్పుడైతే సూట్ కేసుల‌తో వెళ్లి వీడియోల‌కు చిక్కారో అక్క‌డ నుంచి రేవంత్ ద‌శ మారిపోయింది. గుర్తింపు అయితే బాగా వ‌చ్చింది కానీ, కేసీఆర్ స‌ర్కారు…

మొత్తానికి రేవంత్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్న‌ట్టుగా ఉన్నారు. ఎప్పుడైతే సూట్ కేసుల‌తో వెళ్లి వీడియోల‌కు చిక్కారో అక్క‌డ నుంచి రేవంత్ ద‌శ మారిపోయింది. గుర్తింపు అయితే బాగా వ‌చ్చింది కానీ, కేసీఆర్ స‌ర్కారు మాత్రం  రేవంత్ తో ఒక ఆట ఆడుకుంటూ ఉంది. సూట్ కేసులు మోసిన కేసులోనే ఆయ‌న కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వ‌చ్చారు. అంత‌కు ముందు కాంగ్రెస్-టీడీపీ క‌లిసి జ‌గ‌న్ ను జైల్లో పెడితే, అప్ప‌ట్లో రేవంత్ సుద్దులు చెప్పారు. క‌ట్ చేస్తే జైలు జీవితం గురించి ఆయ‌న చెప్పుకోవాల్సి వ‌చ్చింది. 

ఆ సంగ‌త‌లా ఉంటే.. తాజాగా వేరే కేసులో రేవంత్ కు బెయిల్ వ‌చ్చింది. దాదాపు 15 రోజుల‌కు రేవంత్ రెడ్డి విడుదల అవుతున్న‌ట్టుగా ఉన్నారు. అయితే ఈ కేసులో రేవంత్ ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండ‌ట‌మే పెద్ద కామెడీ. కేటీఆర్ ఇంటి మీద డ్రోన్లు ఎగ‌రేసిన వ్య‌వ‌హారంలో రేవంత్ పై కేసు న‌మోదు కావ‌డం, ఆయ‌న అరెస్టు కావ‌డం జ‌రిగింది. అయితే అనుమ‌తి లేకుండా వేరే వాళ్ల ఇళ్ల‌పై డ్రోన్లు ఎగ‌రేయ‌డం అనే నేరానికి ప‌డే శిక్ష దాదాపు నెల రోజులు మాత్ర‌మేన‌ట‌!

ఈ విష‌యంలో రేవంత్ త‌ర‌ఫున సుప్రీం కోర్టు లాయ‌ర్ కాంగ్రెస్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ వ‌చ్చి వాదించారు. ఈ నేరం రుజువైతే ప‌డే శిక్షే నెల రోజులు అని, అలాంటి కేసులో ఇన్ని రోజుల పాటు త‌న క్లైంట్ ను నిర్భందించ‌డం ఏమిటి? అంటూ ఖుర్షీద్ ఇటీవ‌ల విచార‌ణ సంద‌ర్భంగా వాదించార‌ట‌. మొత్తానికి ఆయ‌న మంచి పాయింటే ప‌ట్టిన‌ట్టుగా ఉన్నాడు.

నెల రోజుల పాటు శిక్ష ప‌డే కేసులో ఎన్ని రోజులు బెయిల్ ఇవ్వ‌కుండా ఉంటారంటూ ఆయ‌న కోర్టులో బ‌ల్ల అద‌ర‌గొట్టేశార‌ట‌. దీంతో రేవంత్ కు బెయిల్ ఇచ్చింది న్యాయ‌స్థానం. నెల రోజులు శిక్ష ప‌డే కేసులో ఇలా విచార‌ణ‌లోనే దాదాపు ప‌క్షం రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. రేవంత్ అంటే మ‌రీ కామెడీ అయిపోయిన‌ట్టుగా ఉంది!

ద్యేవుడా…బ‌ట్ట‌ల్లేకుండా క‌నిపించ‌డం స్టార్ హీరోయిన్‌కు స‌ర‌దా అట‌!

లేడీ పోలీస్ బాబీ రాణి వార్నింగ్