పీవీ సింధు…భారత బ్యాడ్మింటన్ స్టార్. ఆటలో ఎన్నో ఎత్తు పల్లాలను పీవీ సింధు చూశారు. ఆటలో ఎన్నో జయాపజయాలను కూడా ఆమె మూటకట్టుకున్నారు. కానీ అలాంటి దిగ్గజ బ్మాడ్మింటన్ క్రీడాకారిణితో కరోనా ఓ ఆట ఆడుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా భిన్నమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు ఇటీవల కరోనా తనకు ఎలాంటి అనుభవాలు మిగిల్చిందో చెప్పారు. కరోనా వైరస్ కారణంగా తన కెరీర్లో పూర్తి భిన్నమైన అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.
ఎక్కడైనా టోర్నీలకు వెళ్లినప్పుడు పరిచయస్తులైన క్రీడాకారులు ఎదురైనప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం అలవాటన్నారామె. ఆల్ ఇంగ్లాండ్‌లో మాత్రం ఈ దఫా అందుకు భిన్నమైన అనుభవం ఎదురైందన్నారు. ఎంత తెలిసిన వాళ్లు ఎదురైనా, చాలా క్లోజ్ రిలేషన్సిఫ్ ఉన్నా…కేవలం చిరునవ్వుతో పలకరించడం వరకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు.
అంతేకాదని, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా క్రీడాకారులు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సంప్రదాయాన్ని కరోనా దెబ్బతో పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. స్టేడియంలో వివిధ దేశాల వాళ్లు ఉండేవాళ్లన్నారు. దీంతో ఒకరికొకరం దూరం దూరంగా కూర్చోవాల్సి వచ్చిందన్నారు. ఇక మాస్క్‌లు ధరించడం తప్పని సరిగా పాటించామన్నారు.
క్వార్టర్ ఫైనల్‌కు ముందు రోజు విదేశీ కోచ్ పార్క్ (కొరియా) పంపేయాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో నాలో కాస్తా ఆందోళన కలిగిందన్నారు. తాను ఉండాలా , వెళ్లిపోవాలా అనే విషయమై క్లారిటీ కోసం క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు ఫోన్ చేసినట్టు పీవీ సింధు తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆటను కంటిన్యూ చేయాలని ఆయన సలహా ఇచ్చారన్నారు.
అయితే ఇంగ్లండ్, దుబాయ్‌లతో పోల్చుకుంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. పదిరోజులుగా ఇంటి నుంచి బయటకు కదల్లేదని ఆమె తెలిపారు. శిక్షణను కూడా కట్టిపడేసినట్టు సింధు చెప్పారు. ఇన్నిరోజులు ఆటకు దూరంగా ఉండాల్సి రావడం ఇదే ప్రథమమన్నారు.
తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!