సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయాలంటే పదవులే కాదు, తిట్లు కూడా ఉంటాయని ఆయనకు అనుభవంలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ కట్టబట్టడం సరికాదన్నారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు. అందరి ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రా మిరెడ్డి అని మండిపడ్డారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే విద్యలో నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు.