అర్లీ ట్రెండ్స్ లో క్లియర్ మెజారిటీతో కనిపించిన ఆర్జేడీ ఆ తర్వాత మందగమనంలో పడింది. అతి పెద్ద పార్టీగా నిలుస్తున్నా.. కూటమిగా మెజారిటీకీ కాస్త అటూ ఇటూ నిలిచేలా ఉంది ఆర్జేడీ. మొదట్లో వెనుకబడిన ఎన్డీయే కూటమి ఆ తర్వాత పుంజుకుంటూ వస్తోంది. బీజేపీ-జేడీయూలు కూటమిగా మెరుగైన పరిస్థితుల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయి. అయితే కౌంటింగ్ ఉత్కంఠభరితంగా, ఫలితాల్లో మలుపులను ఇస్తూ కొనసాగుతూ ఉంది.
ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే.. ఆర్జేడీ 80 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 61 స్థానాల్లో , జేడీయూ 50 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ ఆరు స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇతర పార్టీలు ఏకంగా 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఏకూటమికీ ప్రస్తుతం స్పష్టమైన మెజారిటీ లేదు. ఆర్జేడీ కూటమికి 117 స్థానాల్లో లీడ్ ఉంది. ఎన్డీయే కూటమికి దాదాపు 116 స్థానాల్లో లీడ్ ఉంది. ఏ కూటమి అయినా స్వల్పమైన మెజారిటీని సాధించడం లేదు, ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి అయినా నెలకొనేలా ఉంది. పూర్తి స్థాయి కౌంటింగ్ కు ఇంకా చాలా రౌండ్స్ మిగిలి ఉన్నాయి.