కారంచేడులో దళితులపై ఊచకోతకు తెగబడ్డట్టే…ఇప్పుడు మరో అణగారిన వర్గంపై అదే మార్గం ఎంచుకున్నారు. అయితే కారం చేడులో కత్తులు, గొడ్డళ్లు, కర్రలు చేతపట్టి వేటాడి, వెంటాడి అతి కిరాతకంగా దళితులను తెగనరికిన సామాజిక వర్గమే …ఇప్పుడు బీసీలపై కక్ష కట్టి అంతమొందించేందుకు కలం అనే కత్తి పట్టింది.
కారంచేడులో దళిత మహిళల మానాన్ని చెరబట్టిన ఆ మూకే…నేడు బీసీల ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని ఎక్కడికక్కడ విద్వేషపూరిత అక్షరాలు, మాటలతో తుద ముట్టించాలని కలం అనే ఖడ్గాన్ని ఆ సామాజిక వర్గం చేతపట్టింది. దీనికి ఎల్లో మీడియా అధినేత ఆర్కే అనే మహానుభావుడు నాయకత్వం వహిస్తున్నాడు.
సాయం కోరి ఫోన్ చేసిన వ్యక్తికి ఆపన్నహస్తం అందించడానికి సదరు మీడియా పెట్టిన ‘కమ్మ’ని పేరు కుట్ర. నిజంగా కుట్రలు చేయడమే బీసీలకు తెలిసి ఉంటే, ఆ విద్యే ఒంటబట్టించుకుని ఉంటే…సమాజంలో సగభాగమైన వారు రాజ్యాధికారానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పగలరా? కుట్ర, కుతంత్రాలకు సరైన నిర్వచనం శ్రీమాన్ చంద్రబాబునాయుడు గారిని అడిగితే తప్పక ‘బ్రీప్’ చేస్తాడు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి తన ఎమ్మెల్యే ద్వారా పంపి, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడాన్ని ఏ పేరుతో పిలుచుకుందామో…నేడు ఈశ్వరయ్య కుట్ర గురించి తెగ బాధపడుతున్న ఎల్లో మీడియా చెబితే బాగుంటుంది.
అసలు జస్టిస్ ఈశ్వరయ్యను టీడీపీ, ఎల్లో మీడియా ఏం చేయాలనుకుంటోంది? ఇంత పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించి, తనకేమీ తెలియదన్నట్టుగా హైదరాబాద్‌లో కూచొని ఉన్న చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఈశ్వరయ్యపై టీడీపీ బీసీ నేత యనమల రామకృష్ణుడిని ఉసిగొల్పడం బాబుకే చెల్లింది. ఈశ్వరయ్య తన పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వమే తొలగించాలని యనమల డిమాండ్ చేశారు. మరే టీడీపీ నేతలు ఈశ్వరయ్యపై ఎందుకు మాట్లాడలేదో తెలుసుకో లేనంత అమాయకత్వంలో, అజ్ఞానంలో బీసీలు ఉన్నారని చంద్రబాబు అనుకోవచ్చు గానీ, వాస్తవానికి పరిస్థితి అట్లా లేదు.
ప్రజాకోర్టుకు మించిన కోర్టులు, ప్రజలకు మించిన తీర్పరులు లేరని చంద్రబాబు కంటే తెలిసిన వారు మరొకరు లేరు. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాకోర్టులో వెల్లువెత్తిన తీర్పునకు చంద్రబాబు కొట్టుకుపోయారు కాబట్టి. ప్రతిరోజూ ఈశ్వరయ్య, రామకృష్ణల మధ్య ఫోన్ సంభాషణపై ఏదో ఒక అంశాన్ని ముందుకు తెచ్చి రచ్చ చేస్తూ…బీసీల మనోభావాలను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనే ప్రయత్నాలను టీడీపీ తన ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తోంది.
ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ అధ్యక్ష పదవికి జస్టిస్ ఈశ్వరయ్య రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ఎల్లో మీడియా అనే శిఖండిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేయడం ద్వారా బీసీల్లోకి ఎలాంటి సందేశాన్ని పంపాలనుకుంటున్నారు? బీసీలు కుట్రదారులుగా చిత్రీకరించడం వెనుక బాబు సామాజిక వర్గం ప్రధాన ఆశయం ఏంటి? అంటే తమను కాదన్న వారెవ రికైనా కారంచేడులో దళితులకు పట్టిన గతే పడుతుందనే పరోక్ష హెచ్చరికను చంద్రబాబు, ఆర్కే పంపదలిచారా?
‘ఇంత జరుగుతున్నా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కిమ్మ నడంలేదు. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి గీత దాటితే చర్యలు తీసు కోవాలి. కానీ, ఈ విషయంలో జస్టిస్ ఈశ్వరయ్యపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన వివరణ కోరలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించనూ లేదు. దీంతో… జస్టిస్ ఈశ్వరయ్య మాటలు, చేతల వెనుక ప్రభుత్వం ఉన్నట్లుగానే భావించాలని ఒక న్యాయ నిపుణుడు తెలిపారు’
ఎల్లో మీడియాలోని ఈ రాతలు ఏం కోరుకుంటున్నాయి? అసలు బీసీలు ఏ పదవిలో ఉండకూడదనా? గతంలో జడ్జిలుగా బీసీలు పనికి రారని చంద్రబాబు లేఖ రాయడానికి ఈ వ్యాఖ్యలు కొనసాగింపని అర్థం చేసుకోవాలా? ఏం బీసీలను ఆదరించడమే ముఖ్యమంత్రి జగన్ చేసిన నేరమా? అదే నేరం, ఘోరమైతే…అందులో జగన్‌ది కూడా పాత్ర ఉందనే అనుకుందాం. జనాభాలో నాలుగైదు శాతం ఉండే అగ్రకులాలే పాలకులు ఎందుకు అవుతున్నారు? సగం జనాభా ఉన్న బీసీలు పాలకులు ఎందుకు కాలేకపోతున్నారు? ఇది బీసీల కుట్ర ఫలితమని ఎల్లో మీడియా తీర్పులను బట్టి అర్థం చేసుకోవాలా?
టీడీపీ, ఎల్లో మీడియా కోరుకున్నట్టు త్వరగా ఈశ్వరయ్యను పదవి నుంచి దించేయండి. ఆయన కుట్రలకు ఉరిశిక్ష విధించండి. అప్పటికీ శాంతించకపోతే…బీసీలందరినీ వరుస పెట్టి జలియన్వాలాబాగాలో ఆంగ్లేయులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేయండి. కారంచేడులో దళితుల్ని వెంటాడి, వేటాడి తెగనరికినట్టు నరికేయండి. ఇప్పుడు ప్రతిరోజూ జస్టిస్ ఈశ్వరయ్యపై డిబేట్ల పేరుతో బీసీ సామాజిక వర్గ వ్యక్తిత్వ, ఆత్మాభిమాన హననానికి, జలియన్ వాలాబాగ్, కారంచేడు దుర్ఘట నలకు పెద్దగా తేడా లేదు లేండి. వర్ధిల్లాలి చంద్రబాబు, ఆర్కే కుట్రలు.