ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కే అంగాంగ ప్రదర్శన ముందు…క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న నిరసన ప్రదర్శన ఎంత? క‌్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్‌లో మహిళా నటులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖులు, వాళ్ల తనయులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె విమర్శలకు తగిన ఆధారాలను కూడా బయటపెట్టారు. సినిమా అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అంతేకాదు, ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించారామె.
అప్పట్లో శ్రీరెడ్డికి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అండగా నిలిచాయి. కానీ శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపై విమర్శలు కూడా అదే స్థాయిలో చెలరేగాయి. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనను తప్పు పడితే….ప్రతిరోజూ విలువల వలువలు విడిచి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న వార్తా కథనాల్లోనూ, అలాగే ప్రతి ఆదివారం ఆర్‌కే రాసే కొత్తపలుకు రాతల్లో ఆర్‌కే దిగంబరత్వం ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది.
శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టడం వెనుక ఓ ఆశయం, ఆవేదన ఉన్నాయి. మరి జర్నలిస్టు మహాశయుడిగా తనను అభివర్ణించుకుంటున్న ఆర్‌కే ఎందుకు ఒంటిపై బట్టల్లేకుండా తిరుగుతూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నాడో ఏమీ అర్థం కాలేదు. ఈ వారం కొత్త పలుకులో ‘ఐటీ…అసలు నిజం!’ పేరుతో నిస్సిగ్గుగా ఓ కథనం రాశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఆరురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించి ఐటీ అధికారులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.2వేల కోట్లు దారి మళ్లించినట్టు నిర్ధారణ అయ్యిందని ఐటీ అధికారులు ప్రకటించారు. అయితే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ విమర్శల్లో నిజం లేదని, అసలు నిజాలేంటో తాను చెబుతానని చంద్రబాబు ‘డై హార్ట్ ఫ్యాన్’ ఆర్‌కే ముందుకొచ్చాడు.
‘అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి ఐటీ శాఖ అధికారులను సంప్రదించగా.. విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి. సోదాలు జరిగిన కంపెనీల టర్నోవర్ అంతా కలిపి కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఉండదనీ, సబ్ కాంట్రాక్టర్ల టర్నోవర్‌ను కూడా కలుపుకొని రెండు వేల కోట్ల రూపాయలు లెక్క చెబుతున్నారనీ ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ నుంచి విడుదల అయిన ప్రకటనలో పేర్కొన్నట్టు రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని రుజువు చేయడానికి తగిన పత్రాలు కూడా లభించలేదని స్పష్టం చేస్తున్నారు’... ఇదీ ఆర్‌కే తేల్చిన నిజం.
మరి ప్రెస్‌నోట్ విడుదల చేసిన వాళ్లు కాకుండా, ఆర్‌కేకు ఈ ‘పచ్చ’ నిజాలు చెప్పిన అధికారులెవరో కూడా చెబితే బాగుంటుంది. తన మాజీ పీఎస్ నివాసంలో ఐటీ సోదాలపై చంద్రబాబే ఇంత వరకు నోరు తెరవలేదు. కనీసం ఆ శ్రీనివాస్ కూడా ఏం జరిగిందో చెప్పలేదు. ఆర్‌కే మాత్రం తెగ బాధపడిపోయి…ఐటీ అధికారులను సంప్రదించి ఎట్టకేలకు నిజాలను ఛేదించి జనం ముందుకు తీసుకొచ్చాడు. దీంతో చంద్రబాబు, లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలకు కొత్త ఊపిరి పోసినట్టైంది.
‘రాజధాని తరలింపు వంటి అంశాలతోపాటు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకోకపోతుందా? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు గానీ, కేంద్రంలో అటువంటి కదలిక కనిపించడం లేదు’
‘తనను కలిసిన వారు అడిగే అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేనప్పుడే ‘‘అమిత్‌షాను కలవండి..’’ అని ప్రధాని మోదీ సూచిస్తారని బీజేపీ నాయకులు చెబుతుంటారు’
పైన పేర్కొన్న రెండు విషయాలు ఈ వారం కొత్తపలుకులోనివే. ఒకవైపు సానుకూల నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేనప్పుడే అమిత్‌షాను కలవండి అని ప్రధాని సూచిస్తారని బీజేపీ నాయకులు తన చెవిలో చెప్పారంటున్న ఆర్‌కే…కేంద్రం జోక్యం చేసుకోకపోతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు గానీ, కేంద్రంలో అలాంటి కదలిక కనిపించలేదని ఆయనే చెబుతారు. ఏమిటీ రాతలు? ఒకదాని కొకటి ఏదైనా పొంతన ఉందా? ఆర్‌కేలో ఎందుకీ గందరగోళం?
ఇటీవల సోషల్ మీడియాలో ఆర్‌కే గురించి బాగా వైరల్ అవుతున్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. వాటి నిజానిజాల గురించి ఆర్‌కేనే అడిగితే బాగుంటుంది. ఎందుకంటే అధికారిక నిజాల కంటే అనధికార నిజాలు చెప్పేవాళ్లు ఆయనకు బాగా తెలుసు.
గత జన్మలో ఆర్‌కే ఆడపుట్టుక పుట్టాడట. అంతేకాదు చంద్రబాబును గాఢంగా ప్రేమించాడట. ఆర్థిక అసమానతలతో ఇద్దరూ పెళ్లి చేసుకోలేక పోయారట. అమర ప్రేమికురాలిగా ఆర్‌కే మాత్రం జీవితాంతం పెళ్లి చేసుకోలేదట. చంద్రబాబు మాత్రం పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని…అప్పుడప్పుడు ఆర్‌కే దగ్గరికి వచ్చిపోయేవాడట. ఈ విషయాలన్ని ఇటీవల ఓ జ్యోతిష్యుడు ఆర్‌కే కుటుంబ సభ్యులకు చెప్పాడట. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకున్నప్పటి నుంచి బాబుపై ఆర్‌కేలో మరింత ప్రేమ పెరిగిందట. ఆర్‌కేలో ఏదో ‘తేడా’ కనిపిస్తుందోనని….ఆయనకు అత్యంత సన్నిహిత మహిళ ఇటీవల ఓ జర్నలిస్టు ప్రముఖుడితో చెప్పి వాపోయిందట.
ఇటీవల లోకేశ్, భువనేశ్వరి మధ్య సంభాషణ అంటూ మరో అంశం వైరల్ అవుతోంది. ‘చినబాబు ఆ ఆర్‌కే ఆడది కాక సరిపోయింది గానీ, లేకపోతేనా నా బతుకు బస్టాండ్ అయ్యి ఉండేదేమో’ అని లోకేశ్‌తో భువనేశ్వరి అన్నారట. ‘ఏమైందమ్మా’ అని లోకేశ్ అమాయకంగా తల్లిని ప్రశ్నించాడట. ‘అదేమిట్రా మీ నాన్న గురించి నాకంటే ఆ ఆర్‌కేకే బాగా తెలిసినట్టుంది. భార్యగా నాకు మాత్రమే తెలియాల్సిన విషయాలు...ఆయనకెలా తెలుస్తున్నాయో ఏమీ అర్థం కావడం లేదు. పొరపాటున ఆయన కానీ ఆడదై పుట్టింటే నా పరిస్థితి ఏంటో అనే బెంగ అప్పుడప్పుడు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు బాబు’ అని వాపోయారట.