నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే విషయం 2 రోజుల కిందటే తేలిపోయింది. అయితే ఆమెకు ఏ పోర్టుపోలియో కేటాయిస్తారనే అంశంపై చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఎక్కువమంది ఆమెకు హోంశాఖ కేటాయిస్తారని అనుకున్నారు. ఈ ఫీలర్ బయటకొచ్చిన కొన్ని గంటలకే, ఆమె పోర్టుపోలియో మార్చేశారు పుకారు రాయుళ్లు.
హోం శాఖ కాకుండా.. రోజాకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని ఊహాగానాలు చెలరేగాయి. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి.. ఆమెకు సినిమాటోగ్రఫీ ఇస్తారనే లాజిక్ కూడా బాగానే సింక్ అయింది. అయితే వాస్తవానికి వచ్చేసరికి రోజాకు ఆ రెండు పదవులు దక్కలేదు. ముఖ్యమంత్రి జగన్, ఆమెకు పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు.
మంత్రిమండలి కూర్పు కోసం చాలా కసరత్తు చేసిన ముఖ్యమంత్రి.. శాఖల కేటాయింపు విషయంలో మాత్రం తన జోరు చూపించారు. ప్రమాణ స్వీకారాలు పూర్తయిన కొన్ని గంటలకే పోర్టుపోలియోలు ప్రకటించారు. ఏపీలో కొత్త మంత్రులు, వాళ్లకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి.
1. ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
2. సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక, మత్స శాఖలు
3. బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
4. రాజన్నదొర – గిరిజన సంక్షేమం (డిప్యూటీ సీఎం)
5. గుడివాడ అమర్నాథ్ – ఐటీ, పరిశ్రమలు
6. బూడి ముత్యాలనాయుడు – పంచాయతీరాజ్ (డిప్యూటీ సీఎం)
7. విశ్వరూప్ – రవాణాశాఖ
8. చెల్లుబోయిన వేణుగోపాల్ – ఐ అండ్ పీఆర్, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ
9. దాడిశెట్టిరాజా – రోడ్లు-భవనాలు
10. తానేటి వనిత – హోంమంత్రి
11. కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాలు
12. కొట్టు సత్యనారాయణ – దేవాదాయ (డిప్యూటీ సీఎం)
13. జోగి రమేష్ – గృహనిర్మాణం
14. మేరుగు నాగార్జున – సాంఘికసంక్షేమం
15. విడదల రజనీ – మహిళా,శిశు సంక్షేమం
16. అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
17. ఆదిమూలపు సురేష్ – మున్సిపల్ శాఖ
18. అంజాత్ బాషా – మైనార్టీ వ్యవహారాలు (డిప్యూటీ సీఎం)
19. బుగ్గన రాజేంద్రనాథ్ – ఆర్ధిక, వాణిజ్యపన్నులు, ప్రణాళిక
20. పెద్దిరెడ్డి – విద్యుత్, అటవీ, పర్యావరణం
21. నారాయణస్వామి – ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
22. ఉషా శ్రీచరణ్ – స్త్రీ శిశు సంక్షేమం
23. రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
24. జయరాం – కార్మిక శాఖ
25. కాకాని – వ్యవసాయం