మంత్రి పదవి రాలేదని అలకబూనారు. ఏకంగా సీఎం పేషీ నుంచి కాల్స్ ఎత్తడం మానేశారు. తన ఫోన్ స్విచాఫ్ చేశారు. ఇంటికొచ్చిన సజ్జలతో కూడా మాట్లాడలేదు. మరోవైపు కార్యకర్తల వీరంగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకోవైపు రాజీనామా అంటూ పుకార్లు. ఇలా నిన్న రాత్రి నుంచి ఈరోజు సాయంత్రం వరకు అలజడి రేపిన బాలినేని, శాంతించారు. 'అబ్బే.. ఏం లేదు' అంటూ తేల్చేశారు.
బాలినేని అసంతృప్తి టీ కప్పులో తుపాను లాంటిదని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. కానీ ఎల్లో మీడియా వినలేదు. ఇష్టమొచ్చినట్టు రాసేసింది. కానీ అలాంటిదేం లేదని బాలినేని కొట్టిపారేశారు. తనది వైసీపీ కుటుంబం అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత కష్టపడి పార్టీని గెలిపిస్తానని శపథం చేశారు.
ఇంతకీ ఏం జరిగింది..
బాలినేని ఇలా ఉన్నట్టుంది శాంతమూర్తిగా మారడం వెనక చాలా పెద్ద తతంగం నడిచింది. సజ్దల ఆయన్ను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకెళ్లారు. జగన్, బాలినేనికి అంతా వివరంగా చెప్పారు. ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయానో వివరించారు. అక్కడితో ఆగకుండా.. నెక్ట్స్ టైమ్ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చారు. దీంతో బాలినేని శాంతించారు.
మీటింగ్ తర్వాత బయటకొచ్చిన బాలినేని.. ఆల్ ఈజ్ వెల్ అన్నారు. జై జగన్ అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, పార్టీ గెలుపు ముఖ్యమన్నారు. ఇవన్నీ ఒకెత్తయితే సజ్జలపై ఆయన చేసిన కామెంట్స్ మరీ కామెడీ.
బాలినేనిని బుజ్జగించేందుకు నిన్నట్నుంచి సజ్జల ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్పందించిన బాలినేని.. తనతో కలిసి భోజనం చేసేందుకే సజ్జల ఇంటికొచ్చారని, తామిద్దరం తరచూ కలిసి మాట్లాడుకుంటామంటూ ప్రకటించారు. మొత్తమ్మీద టీ కప్పులో తుపాను చల్లారింది. బాలినేని అసంతృప్తి చల్లారింది.
పిన్నెళ్లి, మేకతోటి సంగతి తేలాల్సి ఉంది. రేపోమాపో వాళ్లు కూడా జై జగన్ అనక తప్పదు.