సరిలేరు నీకెవ్వరు.. జనం మెచ్చిన జగన్

“అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ సీఎం జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆలోచన కంటే ఆయనలో ఆవేశం ఎక్కువగా కనిపిస్తోంది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా కనీసం కాస్త ఆలోచించొచ్చు కదా, ఎవరితోనైనా చర్చించొచ్చు కదా, మరీ…

“అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ సీఎం జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆలోచన కంటే ఆయనలో ఆవేశం ఎక్కువగా కనిపిస్తోంది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా కనీసం కాస్త ఆలోచించొచ్చు కదా, ఎవరితోనైనా చర్చించొచ్చు కదా, మరీ అంత స్పీడ్ అయితే ఎలా..” 

జగన్ ని అభిమానించేవారు కూడా ఆయన గురించి ఇలాగే అనుకుంటున్నారు. కాస్త చదువుకున్నవారు, విషయ పరిజ్ఞానం ఉన్నవారు, ఒకరకంగా చెప్పాలంటే కాస్తో కూస్తో మేథావి బ్యాచ్.. ఇలానే లెక్కలేస్తూ వస్తోంది. కానీ సామాన్య జనంలో మాత్రం జగన్ ఇమేజ్ దీనికి పూర్తి భిన్నంగా పెరిగిపోతోంది. 

టీడీపీ అనుకూల మీడియా తప్పుడు రాతలతో పాటు, జగన్ సొంత మీడియా ప్రజాభిప్రాయాలను సరిగ్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడంతో క్షేత్ర స్థాయి వాస్తవాలు పెద్దగా బైటకు రావడంలేదు కానీ, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సామాన్య ప్రజానీకంలో సూపర్ హిట్ అయ్యాయనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే తాను చేయాలనుకున్న మార్పులన్నీ చేసేశారు జగన్. అమ్మఒడి, రైతు భరోసా, నేతన్నకు ఆర్థిక సాయం.. ఇలాంటివన్నీ ఎవరూ కలలో కూడా ఊహించనివి. 

సచివాలయ ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల వ్యవస్థ కూడా ఎన్నో అనుమానాలతో పట్టాలెక్కింది. ఈ పథకాలన్నిటికీ డబ్బులెలా వస్తాయి, ఇంతమందికి జీతాలెలా ఇస్తారని కొంతమంది తెగ మథనపడిపోతున్నారు. అయితే సామాన్య జనం మాత్రం అందులో జగన్ ధైర్యాన్ని చూశారు, ప్రజలకు మంచి చేయాలన్న తపన మాత్రమే చూశారు. దీనికితోడు.. ఇంగ్లిష్ మీడియం, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి విషయాలకు సవాలక్ష అడ్డంకుల్ని ఎదుర్కుంటున్నారు జగన్. కోర్టులో కేసులు వేసి మరీ అడ్డుకోవాలని చూస్తున్నారు. వీటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడం, మండలి రద్దు వంటి నిర్ణయాల్లో జగన్ సాహసాన్ని మాత్రమే జనం గుర్తించారు. 

మొండోడు, గట్టోడు, పట్టుబడితే వదలడు, ఎవర్నీ లెక్కచేయడు, పౌరుషం ఉన్నోడు.. ఇలా జనంలోకి వెళ్లిపోయారు జగన్. ఎన్నికలకు ముందు వరకూ కేవలం వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులకు మాత్రమే జగన్ ఇలా పరిచయం. అధికారంలోకి వచ్చి తానేంటో చూపించిన తర్వాత జనం అందరికీ జగన్ ఓ సూపర్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. ఆ మొండి పట్టుదలే జగన్ కి శ్రీరామ రక్షగా నిలుస్తోంది.

కింగ్ ఆఫ్ కామెడీ మా అందరికి గాడ్ ఫాదర్

మా తార‌క్ బావ‌కి ధ్యాంక్స్ చెప్పుకుంటా