‘సాక్షి’లో జీతాల పెంపు

సాక్షి జర్నలిస్ట్ ల కష్టం పలించింది. సాక్షి అధినేత జగన్ పాదయాత్రతో కష్టపడితే, సాక్షి జర్నలిస్టులు, విపరీతంగా వార్తలు రాసి, కథనాలు వండి వార్చి కింద నుంచి పై వరకు కష్టపడ్డారు. ఆ కష్టాన్ని…

సాక్షి జర్నలిస్ట్ ల కష్టం పలించింది. సాక్షి అధినేత జగన్ పాదయాత్రతో కష్టపడితే, సాక్షి జర్నలిస్టులు, విపరీతంగా వార్తలు రాసి, కథనాలు వండి వార్చి కింద నుంచి పై వరకు కష్టపడ్డారు. ఆ కష్టాన్ని యాజమాన్యం గుర్తించింది. జూన్ నెల జీతంతో పాటు ప్రతి ఒక్కరికీ జీతం పెంచి అందించారు. 

జర్నలిస్ట్ ల్లో అందరికన్నా దిగువన వుండే స్ట్రింగర్ల దగ్గర నుంచి టాప్ న వుండే స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరికీ వేతనాలు పెంచినట్లు తెలుస్తోంది. కనీసం రెండు వేల నుంచి జీతాలు పెంచారు. పై తరగతి ఎడిటోరియల్ స్టాఫ్ కు కాస్త భారీగానే పెరిగినట్లు బోగట్టా. కింది వారికి మాత్రం ఆరుశాతం వంతున పెంచారని, పైవారికి బాగా పెంచారనే చిన్న అసంతృప్తి కూడా ఉద్యోగుల్లో వున్నట్లు బోగట్టా.

ఇక విజయవాడ కేంద్రం

ఇదిలా వుంటే సాక్షి ఛానెల్ ను విజయవాడ కేంద్రంగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వున్నంత రేంజ్ లో భారీగా విజయవాడలో ఆఫీసు, సిబ్బందిని ఏర్పాటు చేసే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆఫీసు ను బ్రాంచ్ గా వుంచి, విజయవాడ లేదా అమరావతిలో మెయిన్ ఆఫీస్ ఏర్పాటు చేసే ఆలోచన వున్నట్లు తెలుస్తోంది.

దాదాపు ఏడాది కాలంగా సాక్షి చానెల్ బాగా పాపులర్ అయింది. టీవీ 9 తరవాత ఇప్పుడు రేటింగ్ ల్లో సాక్షినే వుంది. ఇప్పుడు జగన్ కు అధికారం అందినందున, కేబుల్ ఆఫరేటర్లు కూడా సాక్షిని ఇక ప్రయిమ్ బాండ్ లో వుంచుతారు. అందువల్ల అయిదేళ్ల పాటు సాక్షికి తిరుగు వుండదు.