సంచయిత మరీ ఓవర్ చేస్తన్నట్లు లేదూ?

రాజరికమా అర్హతను నిర్ణయించునది..క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్నవారే రాజులు అంటూ ఓ కొత్త వాదం తీసారు ఎన్టీఆర్-కొండవీటి వెంకటకవి  కలిసి. ఈ డైలాగు ఇలా తీయడం వెనుక ఏముంది? వారి మనసులో ఏముండి వుంటుంది…

రాజరికమా అర్హతను నిర్ణయించునది..క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్నవారే రాజులు అంటూ ఓ కొత్త వాదం తీసారు ఎన్టీఆర్-కొండవీటి వెంకటకవి  కలిసి. ఈ డైలాగు ఇలా తీయడం వెనుక ఏముంది? వారి మనసులో ఏముండి వుంటుంది అన్నది పక్కన పెడితే, రాజ్యాలు లేకపోయినా విజయనగరం రాజులు అనిపించుకుంటున్న పూసపాటి వంశీయుల వ్యవహారం రచ్చకెక్కి ప్రజల్లో పడుతోంది. 

రాజ్యం లేకపోయినా, ఏ పార్టీలో వున్నా, విజయనగరం రాజ వంశీకులు అంటే ఆ ప్రాంతంలో అంతో ఇంతో గౌరవం వుంది. కానీ ఇప్పడు ఆ గౌరవం కాస్తా దిగజారిపోయేలా వుంది. ఇక్కడ రాజకీయాలది ఎంత తప్పు వుందో, పూసపాటి వంశానికి చెందిన వ్యక్తిని అని చెబుతూ రాజకీయాలు చేస్తున్న సంచయిత ది కూడా అంతే తప్పు కనిపిస్తోంది. 

సంచయిత ఎవరు? పివిజి రాజు పెద్ద కుమారుడు ఆనంద్ కుమార్తె. ఆనంద్ గజపతి కేరళకు చెందిన ఉమ ను పెళ్లి చేసుకుని ఉమగజపతిని చేసారు. కానీ కొన్నాళ్లకే వారిద్దరు అధికారికంగా విడిపోయారు. ఆడపిల్లలు ఇద్దరిని తీసుకుని ఉమ వెళ్లిపోయారు. వెళ్లిపోవడమే కాదు మళ్లీ పెళ్లి చేసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. మొత్తం మీద ఆ విధంగా పూసపాటి వంశంతో ఆమెకు తెగతెంపులు అయిపోయాయి. అయితే ఆమె కుమార్తె మాత్రం పూసపాటి ఆనంద్ కుమార్తెనే. 

ఇదిలా వుంటే. ఆనంద్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రెండవ భార్యకు ఓ కుమార్తె వున్నారు. ఎక్కడ ఈ భార్య వంశపారంపర్య అధికారం క్లయిమ్ చేస్తారో అని అనుమానం వచ్చిందో, ఆనంద్ సోదరుడు అశోక్ అర్జెంట్ గా చంద్రబాబు ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులతో వంశపారంపర్య ధర్మకర్త అయ్యారు. 

వైకాపా అధికారంలోకి వచ్చాక ఎవరు పావులు కదిపారో, ఏం జరిగిందో అర్జెంట్ గా ఉమ కుమార్తె సంచయిత లైన్ లోకి వచ్చారు. సడెన్ గా ఆమెను వంశపారంపర్య ధర్మకర్తను చేసారు. ఇక రాజకీయాలు షురూ అయ్యాయి. సింహాచలం దేవస్థానంలో సంచయిత వ్యవహారాలు కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ప్రభుత్వం అధికారంలో వుంది కనుక, ఎవరూ పెద్దగా పెదవి విప్పడం లేదు.

అలాగే మాన్సాస్ వ్యవహారాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. నిన్నటికి నిన్న పైడితల్లమ్మ సిరిమాను సంబరం టైమ్ లో సంచయిత మరీ చిన్నపిల్ల మాదిరిగా వ్యవహారించారని వార్తలు వచ్చాయి. రాజకుటుంబీకులు అంతా కోట బురుజు మీద కూర్చుని,  సిరిమాను మీద వున్న పూజారి ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం. ఆ విధంగా ఆనంద్ గజపతి రెండో భార్య, ఆమె కుమార్తే వచ్చి కూర్చున్నారు. పూసపాటి వంశీయులు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. అది ఆచారం. 

కానీ సంచయిత వాళ్లను కూర్చొనివ్వ కూడదని, కిందకు దించేయాలని పోలీసులతో కిందా మీదా అయ్యారు. ఇది మరీ చీప్ గా వుంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా విజయనగరం జనం రాజ వంశీయులకు గౌరవం ఇస్తారు. ఎన్నికల సంగతి పక్కన పెడితే ఆ గౌరవం అలా వుంచుకోవాలి.

కానీ సంచయిత చేస్తున్నవన్నీ కలిసి జనాల్లో ఆమెపై గౌరవాన్ని తగ్గిస్తాయి. పోయి పోయి అది వైకాపా కు చుట్టుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సంచయిత వెనుక వైకాపా వుందని జనం నమ్ముతున్నారు. ఈ విషయం గుర్తించి సంచయిత ను సరైన దారిలో వుంచాల్సిన బాధ్యత వైకాపా పెద్దల మీద వుంది.

ఇది టీడీపీ కాదు కరణం గారూ