తనను ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని చూశారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఉరి శిక్ష పడ్డవాడికైనా చివరి అవకాశం ఇస్తారని, కాని రాత్రికి ,రాత్రి తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక అనామకుడు లేఖ రాస్తే మంత్రిపై ప్రభుత్వం విచారణ చేయిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల పక్షాన తాను ఉన్నానని, ఆత్మగౌరవం తనకు ముఖ్యమని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలలో వాస్తవాలు తెలుసుకోకుండా కెసిఆర్ వ్యవహరించారని అన్నారు.
తెలంగాణ వచ్చే వరకు తాను పార్టీలో ఎలాంటి పోరాటాలు చేసింది అందరికి తెలుసునని ఆయన అన్నారు. హుజూరాబాద్ ప్రజలు తనను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాజేందర్ ప్రకటించారు.