శభాష్ వాలంటీర్ !

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా వారు చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ తప్పుపట్టలేరు. వారు లేకపోతే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక చక్కని అనుసంధానం ఉండదని అంతా కూడా…

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా వారు చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ తప్పుపట్టలేరు. వారు లేకపోతే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక చక్కని అనుసంధానం ఉండదని అంతా కూడా అనుకునే పరిస్థితి ఇపుడు ఉంది.

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వాలంటీర్ మహిళా లబ్దిదారుకు సామాజిక పెన్షన్ ఇవ్వడం కోసం ఏకంగా ఎన్నో జిల్లాలను దాటేసి హైదరాబాద్ వెళ్ళడం ఇపుడు ప్రశంసాపాత్రమవుతోంది.  

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలానికి చెందిన ఒక వితంతు మహిళ అనారోగ్యంతో గత మూడు నెలలుగా హైదరాబాద్ లో ఉంటూ అక్కడ చికిత్స పొందుతోంది. ఆమెకు పెన్షన్ ఇచ్చేందుకు వాలంటీర్ దూబ రాజశేఖరరావు ఏకంగా హైదరబాద్ కే వెళ్ళి ఆమె చేతిలో మూడు నెలల పెన్షన్ మొత్తం 6,750 రూపాయలు పెట్టాడు. 

కష్టకాలంలో ఆ మొత్తం ఆమెకు ఎంతో అసరా అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తానికి ఈ వాలంటీర్ చేసిన పనిని అధికారులతో సహా జనమంతా మెచ్చుకుంటున్నారు.