లేస్తే మనిషిని కానంటున్న శైలజానాధ్?

పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ జగన్ సర్కార్ మీద నిప్పులే కురిపిస్తున్నారు. అన్నిటా విఫలం అయిన పాలన అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. Advertisement ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని కూడా…

పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ జగన్ సర్కార్ మీద నిప్పులే కురిపిస్తున్నారు. అన్నిటా విఫలం అయిన పాలన అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని కూడా విమర్శిస్తున్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ సర్కార్ ఉందని ఆయన అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రైతులకు ఉచిత విద్యుత్ పధకానికి తూట్లు పొడిచి రద్దు చేయాలని జగన్ చూస్తున్నాడు అంటూ శైలజానాధ్ గట్టిగానే తగులుకుంటున్నారు.

మోడీ సర్కార్ విద్యుత్ సంస్కరణలకు తాళం కొడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టాలని వైసీపీ చూస్తోందని ఆయన ఆగ్రహిస్తున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని శైలజానాధ్ గంభీరమైన ప్రకటనలే చేస్తున్నారు.

మొత్తానికి గత రెండు ఎన్నికల్లో ఏపీలో ఉనికి కోల్పోయి కునికిపాట్లు పడుతున్న కాంగ్రెస్ కి ఈ మాత్రం అగ్రెసివ్ మూడ్ అవసరమే అంటున్నారు. అయితే మాటలలో కాకుండా చేతలలో కాంగ్రెస్ పెద్దలు తమ పోరుని, జోరుని చూపిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఉనికి లో ఉంటుందని సెటైర్లు అయితే గట్టిగా పడుతున్నాయి. 

మరో వైపు ఉచిత విద్యుత్ అన్నది వైఎస్సార్ తీసుకువచ్చిన పధకమని, జగన్ దానిని కచ్చితంగా అమలు చేసి తీరుతారని వైసీపీ నేతలు అంటున్నారు.

గ్రేటర్ గెలుపు ఎవరిది