కేటీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ ష‌ర్మిల

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మ‌ద్ద‌తుగా నిలిచారు. రాజ‌కీయాల్లోకి కేటీఆర్ కుటుంబ స‌భ్యుల్ని లాగ‌డంపై ష‌ర్మిల అభ్యంత‌రం చెప్పారు. ఇలాంటి సంద‌ర్భాల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా బాధిత నాయ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు…

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మ‌ద్ద‌తుగా నిలిచారు. రాజ‌కీయాల్లోకి కేటీఆర్ కుటుంబ స‌భ్యుల్ని లాగ‌డంపై ష‌ర్మిల అభ్యంత‌రం చెప్పారు. ఇలాంటి సంద‌ర్భాల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా బాధిత నాయ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు ముందుకు రావాల‌ని ఆమె అప్పీల్ చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షుపై ఇటీవ‌ల బీజేపీలో చేరిన తీన్మార్ మ‌ల్ల‌న్న సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టు పెట్టాడు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న వ్య‌వ‌హార‌శైలిపై తెలంగాణ స‌ర్కార్ ఆగ్ర‌హంగా ఉంది. 

రోజురోజుకూ తీన్మార్ మ‌ల్ల‌న్న హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌నే భావ‌న‌లో కేసీఆర్ స‌ర్కార్ ఉంది. ఈ నేప‌థ్యంలో హిమాన్షు శ‌రీరంపై వ్యంగ్య బొమ్మతో ట్విట‌ర్‌లో మ‌ల్ల‌న్న పోస్టు పెట్ట‌డం వివాదానికి దారి తీసింది. దీనిపై కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ఆవేద‌న‌లో ష‌ర్మిల పాలుపంచుకుంటూ ఓ ట్వీట్ చేయ‌డం విశేషం.

‘పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి’  అని షర్మిల విన్న‌వించారు. 

అధికార పార్టీపై ప్ర‌తిరోజూ విమ‌ర్శ‌లు చేస్తున్న ష‌ర్మిల‌, తాజాగా కుటుంబ స‌భ్యుల్ని రాజ‌కీయాల్లోకి లాగ‌డంపై మాత్రం కేసీఆర్ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. తీన్మార్‌ మ‌ల్ల‌న్న దూకుడు బీజేపీకి ఇబ్బందులు తెచ్చేలా ఉంద‌ని ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.