స్టార్ ఓపెనర్ వివాహ బంధం ర‌న్నౌట్‌

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ వివాహ బంధం రన్నౌట్ అయ్యింది. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి అర్ధాంతరంగా ముగింపు ప‌లికారు. ఈ విష‌యాన్ని శిఖ‌ర్ ధావ‌న్ భార్య ఆయేషా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బ‌హిరంగ‌ప‌రిచారు.…

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ వివాహ బంధం రన్నౌట్ అయ్యింది. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి అర్ధాంతరంగా ముగింపు ప‌లికారు. ఈ విష‌యాన్ని శిఖ‌ర్ ధావ‌న్ భార్య ఆయేషా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బ‌హిరంగ‌ప‌రిచారు. ఈ స‌మాచారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆయేషాకు 46 ఏళ్లు, ధావ‌న్‌కు 35 ఏళ్లు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు అప్ప‌టికే పెళ్ల‌యి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. మొద‌టి భ‌ర్త‌తో విభేదాలొచ్చి విడిపోయింది. అనంత‌రం 2012లో ఆయేషా, ధావ‌న్ పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. వాళ్లిద్ద‌రి ప్రేమ‌కు సంకేతంగా  కుమారుడు పుట్టాడు. మొద‌టి భ‌ర్తకు పుట్టిన ఇద్ద‌రు కూతుళ్ల‌ను త‌న బిడ్డ‌ల్లాగే ధావ‌న్ చూసుకునే వాడు. 

కెరీర్‌లో సాధించిన విజ‌యాల వెనుక ఆయేషా ఉంద‌ని ప‌లు సంద‌ర్భాల్లో ధావ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి మెల్‌బోర్న్‌లో శిఖ‌ర్ ధావ‌న్ ఉంటున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉన్నార‌ని భావిస్తున్న ధావ‌న్ వైవాహిక బంధంలో మ‌న‌స్ప‌ర్థ‌లున్నాయ‌నే స‌మాచారం ఆయ‌న అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. 

ధావ‌న్‌తో విడిపోయిన విష‌యాన్ని ఆయేషా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆమె  ఇన్‌స్టాలో చేసిన పోస్టు ఏంటంటే…

“రెండుసార్లు విడాకులు తీసుకునేంత వ‌ర‌కు కూడా విడాకులు అన్న‌ది చెడ్డ మాట అనుకునేదాన్ని…” అని ఆమె తెలిపింది. త‌మ విడాకుల విష‌య‌మై ఆమె న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు ఎంతో లోతైన అర్థాన్ని ధ్వ‌నిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా వుండ‌గా విడాకుల విష‌య‌మై ధావ‌న్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం గ‌మనార్హం.