హైదరాబాద్ కు చెందిన ప్రణయ్ అనే వ్యక్తి నిన్న కెనడాలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణాలు తీసుకున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడా ఆత్మహత్యకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కెనడా రాజధాని అట్టావాలో ఓ తెలుగమ్మాయిని ప్రేమించాడు ప్రణయ్. ఇద్దరూ కలిసి ఏడాదిగా ఒకే రూమ్ లో ఉంటున్నారు. అయితే ప్రణయ్ కు తెలియకుండా, ఆ అమ్మాయి మరో ఆరుగురితో రిలేషన్ షిప్ లో ఉంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అంతేకాకుండా.. ప్రణయ్ ప్రేమించిన అమ్మాయి సిగరెట్లు తాగుతుందట. అలవాటు లేకపోయినా బలవంతంగా ప్రణయ్ తో కూడా సిగరెట్లు తాగించేదట. పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని, సిగరెట్లు మానేయమని చెబితే పెద్ద గొడవ పెట్టుకుందట.
ఇవన్నీ ఒకెత్తయితే.. తన మాజీ ప్రియులందరితీ సదరు యువతి టచ్ లోకి వెళ్లిందని.. వీసా కన్ ఫర్మ్ అయిన తర్వాత తనకు చెప్పకుండా బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయిందని ప్రణయ్ వివరించాడు. ఈ మేరకు చనిపోయే ముందు ఓ వీడియో రిలీజ్ చేశాడు.
తన మరణం తర్వాత శరీరాన్ని వైద్యపరీక్షల కోసం వాడాలని, అవయవాల్ని దానం చేయాలని ప్రణయ్ తన వీడియోలో కోరాడు.