బీచ్ కొస్తే అది ఉండాల్సిందే…?

బీచ్ కి ఎందుకు వెళ్తారు. ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర కెరటాలను చూసి మురిసిపోవడం కోసం. కూల్ కూల్ గా రిలాక్స్ కావడం కోసం. అందమైన ప్రకృతిని అస్వాదించడానికి. దీనికెక్కడా టికెట్ లేదు, ఆంక్షలు అంతకంటే…

బీచ్ కి ఎందుకు వెళ్తారు. ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర కెరటాలను చూసి మురిసిపోవడం కోసం. కూల్ కూల్ గా రిలాక్స్ కావడం కోసం. అందమైన ప్రకృతిని అస్వాదించడానికి. దీనికెక్కడా టికెట్ లేదు, ఆంక్షలు అంతకంటే లేవు. ఎవరికి ఎపుడు మూడొస్తే అపుడు బీచ్ కెళ్ళి సేద తీరవచ్చు. కావాల్సినంతసేపు అక్కడ గడిపిరావచ్చు.

అలాంటి బీచ్ కి వెళ్లాలంటే ఇపుడు ఒక కచ్చితమైన కండిషన్ పెట్టేశారు. విశాఖ బీచ్ లో హుషార్ చేయాలంటే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే. అలాగే గుంపులుగా కలసి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి మూడవ దశ గట్టిగా ఉంది. ఏపీలో తాజాగా మూడు వేల పై చిలుకు కేసులు నమోదు అవుతూంటే అందులో అయిదవ వంతు వాటా విశాఖదే కావడంతో అధికారులు సీరియస్ గా యాక్షన్ లోకి దిగిపోతున్నారు.

ఏడు వందల కేసులు ఒక్క రోజులోనే నమోదు అయ్యాయి. ఈ నంబర్ ఇంకా పెరిగిపోతుందన్న ఆందోళన కూడా ఉంది. అసలే ఫెస్టివల్ మూడ్ లో జనాలు ఉన్నారు. ఇక బీచ్ సహా టూరిజం స్పాట్స్ అన్నీ కూడా సందర్శకులతో కిక్కిరిసిపోతున్నాయి.

దాంతో కరోనా ప్రోటోకాల్స్ పాటించకుంటే బీచ్ కి రావద్దు అనేస్తున్నారు అధికారులు. మాస్క్ ధారణతోనే సాగర దర్శనం అని కూడా పక్కాగా చెప్పేస్తున్నారు. మొత్తానికి ప్రజలు కూడా తమ ఆరోగ్యం గురించి ఆలోచించుకుని సహకరించాలని మేధావులు విద్యావంతులు కూడా కోరుతున్నారు.