మొదటేమో సమంత విడాకులపై, ఆ తర్వాత సినిమా టికెట్ల రేట్లపై, అడపాదడపా మోడీ సర్కారుపై.. విరుచుకుపడుతూ వస్తున్నారు నటుడు సిద్ధార్థ్. సినిమా టికెట్లను ఏపీ ప్రభుత్వం నిర్ధారిస్తుందంటే.. రాజకీయ నేతల అవినీతి గురించి సిద్ధార్థ్ మాట్లాడారు! మరి సినిమా వాళ్ల కథేంటి? ఎలాంటి బ్లాక్ మనీలతో సినిమాలు రూపొందుతూ ఉన్నాయి?
ఇంత వరకూ సినీ చరిత్రలో ఏ ఒక్క సినిమాకు అయినా బడ్జెట్, పారితోషికాలు, వసూళ్లు, ట్యాక్సుల విషయంలో… వైట్ పేపర్ ఒకటి విడుదల చేస్తారా? తెలుగనే కాదు.. తమిళ, హిందీ, ఇలా ఏ భాష సినిమాలు తీసుకున్నా… డబ్బులు ఎలా వస్తోంది, ఎలా వెళ్తోంది, హీరోల అధికార పారితోషికాలెంత? అనధికారిక లెక్కలేమిటి? అనే అంశాలు ఉండనే ఉన్నాయి. ఇవి మనుపటి నుంచి చర్చలో ఉన్నవే.
వీటి గురించి మాట్లాడని సినిమా వాళ్లు తమ సినిమాల్లో అనవిగాని నీతులు చెబుతూ ఉంటారు. చివరకు బ్లాక్ మనీ గురించి తీసిన శివాజీ సినిమాకు ఎవరెంత తీసుకున్నారో, ఆ సినిమా బడ్జెట్ ఎంతో, వసూళ్లు ఎంతో.. వైట్ గా చెప్పలేదు కదా! అయితే సిద్ధార్థ్ మాత్రం సినిమా టికెట్లకూ, అవినీతికి ముడిపెట్టి సెల్ప్ గోల్ చేసుకున్నారు.
ఇక మోడీ భద్రత గురించి ఏదో ట్వీట్ చేసిన సైనా పై కూడా ఇంతే స్పీడ్ గా వెళ్లాడు సిద్ధార్థ్. సైనా ఏమీ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు. ఏదో కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉంది. ఆమె బీజేపీ విధానాలను సమర్థిస్తూ వాదనలకు దిగడం లేదు. జస్ట్ ప్రధాని భద్రత గురించి ట్వీట్ చేసింది. మరి ఆమెపై సెక్సీ జోకును పేల్చాడు ఈ ముదురు మదనుడు. అది బ్యాక్ ఫైర్ అయ్యింది.
సిద్ధార్థ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన అతి స్పీడుతో బోల్తా పడ్డ ఈ నటుడు.. క్షమాపణలు చెప్పాడు. తద్వారా వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు. అతి వేగం ప్రమాదకరమైని సిద్ధార్థ్ కు ఇప్పుడు అర్థం అయినట్టుగా ఉంది.