అమరావతిపై సమీక్షకు సింగపూర్ ఓకే!

అమరావతి ప్రాజెక్టుల విషయంలో ఏపీలో ఏర్పడిన నూతన ప్రభుత్వం సమీక్షించుకోవచ్చని ప్రకటించారు సింగపూర్ మంత్రి ఒకరు. అమరావతి ప్రాజెక్ట్ విషయంలో ఏర్పడిన సింగపూర్ కన్సార్షియం ఇప్పటికే తమకు ఈ విషయాన్ని తెలిపినట్టుగా వీవీఎన్ బాలకృష్ణన్…

అమరావతి ప్రాజెక్టుల విషయంలో ఏపీలో ఏర్పడిన నూతన ప్రభుత్వం సమీక్షించుకోవచ్చని ప్రకటించారు సింగపూర్ మంత్రి ఒకరు. అమరావతి ప్రాజెక్ట్ విషయంలో ఏర్పడిన సింగపూర్ కన్సార్షియం ఇప్పటికే తమకు ఈ విషయాన్ని తెలిపినట్టుగా వీవీఎన్ బాలకృష్ణన్ అనే సింగపూర్ మంత్రి ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి విషయంలో సింగపూర్ తో చాలా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన అంశాల్లాగా అమరావతి విషయంలో సింగపూర్ తో చేసుకున్న ఒప్పందాలనూ సమీక్షించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం అవుతోంది. అయితే తమ నిర్ణయాలపై సమీక్షలు అంటే చంద్రబాబు నాయుడు అస్సలు ఒప్పుకోవడంలేదు.

అలాంటి సమీక్షలను చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పు పట్టేస్తున్నారు.ఆ తప్పుపట్టేయడం కోసం చంద్రబాబు నాయుడు చాలా అభ్యంతకరమైన పదజాలాన్ని కూడా వాడుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో సింగపూర్ మంత్రి మాత్రం చంద్రబాబుకు నచ్చని మాటలు మాట్లాడారు.

'సమీక్ష చేసుకునే అవకాశం ఏ ప్రభుత్వానికి అయినా ఉంటుంది. అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా సమీక్షించుకోవచ్చు…' అని సదరు మంత్రి వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో సింగపూర్ తో ఒప్పందాలు ఏవైనప్పటికీ సమీక్షలకు మాత్రం అక్కడి మంత్రి తమకు అభ్యంతరం లేదన్నారు.

అయితే  ఈ విషయంలో సహజంగానే చంద్రబాబు నాయుడు మాత్రం ఒప్పుకోకపోవచ్చు. ఇప్పట్లో చంద్రబాబుకు నచ్చనిమాట 'సమీక్ష' అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ విషయంలోనూ ఆయన ఆక్షేపణను తెలియజేస్తారేమో!

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు