30 కోట్లతో చాలదట.. 130 కోట్లు పెట్టాలట!

ప్రతిపక్షంలోకి వెళ్లాకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ల మాటల్లో మాత్రం తీరు మారలేదు. ఏ తీరుతో అయితే వారు వ్యతిరేకతను ఎదుర్కొని ప్రతిపక్షంలోకి వెళ్లారో అవేమాటలు, అదే తీరును వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆ పార్టీ…

ప్రతిపక్షంలోకి వెళ్లాకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ల మాటల్లో మాత్రం తీరు మారలేదు. ఏ తీరుతో అయితే వారు వ్యతిరేకతను ఎదుర్కొని ప్రతిపక్షంలోకి వెళ్లారో అవేమాటలు, అదే తీరును వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆ పార్టీ నేతలు. అందుకు  స్వయంగా చంద్రబాబు నాయుడే ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు.

ఆయనే అలా మాట్లాడుతున్న నేపథ్యంలో మిగతానేతలు కూడా అదే రైటు అనుకుంటూ ఉన్నట్టున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అందుకు ఉదాహరణగా కనిపిస్తున్నారు. అమరావతి సమీపంలో నిర్మించతలపెట్టిన భారీ వెంకటేశ్వరాలయం విషయంలో సుధాకర్ యాదవ్ స్పందించారు.

టీటీడీ నిధులతో నిర్మించే ఈ అలయం కోసం అప్పట్లో నూటా ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారట! ప్రజల సొమ్ము, దేవుడి సొమ్ము కదా.. ఎంతైనా అనుకుంటారు. అమరావతికి పెట్టుబడులు రాబట్టడం మాటేమిటో కానీ, ఇలా దేవుడి ధనంతో అక్కడ హంగామా చేయాలని గత ప్రభుత్వం భావించింది.

అయితే కొత్త ప్రభుత్వం ఆ విషయంలోనూ పొదుపు చర్యలకు వెళ్లింది. 130 కోట్ల రూపాయల బడ్జెట్ వద్దని, 30 కోట్ల రూపాయలతో అక్కడ దేవాలయాన్ని నిర్మిస్తేచాలని నిర్ణయించింది. ఈ  మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో శ్రీవారి ఆలయం అని ఆయన ప్రకటించారు.

దీన్ని ఆక్షేపిస్తున్నారు సుధాకర్ యాదవ్. ముప్పై కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తే సహించేది లేదని, నూటా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అని ఈయన డిమాండ్ చేయడం గమనార్హం! తక్కువ బడ్జెట్ తో దేవాలయం నిర్మించాలని అనుకోవడం రాజకీయం అని సుధాకర్ యాదవ్ ఆరోపించేశారు.

అంటే ప్రజల సొమ్మును, దేవుడి సొమ్మను ఇష్టానుసారం ఖర్చుపెట్టి.. టీటీడీని కూడా దివాళా తీయించే స్థాయిలో దేవాలయాన్ని నిర్మిస్తే తప్ప.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒప్పుకునేలా లేరు. అలాంటి తీరుతోనే అధికారం కోల్పోయినా వారి తీరులో మాత్రం మార్పు కనిపించడంలేదు.

బహుశా టీటీడీ నిధులను ముప్పై కోట్లే వెచ్చిస్తే అమరావతిలో రియలెస్టేట్ కు ఊపురాదేమో, తద్వారా తెలుగుదేశం పార్టీ నేతల భూముల విలువ పడిపోతుందని బాధా ఇదంతా?

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు