చెంప దెబ్బలతో నిగారింపు.. ఇదో రకం బ్యూటీ పార్లర్

అందంగా కనిపించడానికి అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేసియల్స్ చేయించుకోవడం, ముఖానికి ముల్తానా మట్టి రాసుకోవడం లాంటి రెగ్యులర్ పద్ధతులతో పాటు.. బొటాక్స్ ట్రీట్ మెంట్ లాంటివి కూడా చేయించుకుంటారు. అయితే వాటన్నింటికీ భిన్నమైన…

అందంగా కనిపించడానికి అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేసియల్స్ చేయించుకోవడం, ముఖానికి ముల్తానా మట్టి రాసుకోవడం లాంటి రెగ్యులర్ పద్ధతులతో పాటు.. బొటాక్స్ ట్రీట్ మెంట్ లాంటివి కూడా చేయించుకుంటారు. అయితే వాటన్నింటికీ భిన్నమైన పార్లర్ ఇది. నిగారింపు కోసం, మంచి ముఖవర్ఛస్సు కోసం ఇక్కడ చెంప దెబ్బలు కొడతారు. డబ్బులిచ్చి మరీ ఇలా కొట్టించుకుంటున్నారు అమ్మాయిలు.

దక్షిణ కొరియాలో ఈ చెంప దెబ్బల పార్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. రోజుకు 50 చెంప దెబ్బలు కొట్టించుకుంటే ముఖం అందంగా, కాంతిమంతంగా ఉంటుందనేది ఇక్కడ అమ్మాయిల నమ్మకం. అయితే ఎలా పడితే అలా కొట్టరు. ఓ పద్ధతి ప్రకారం కొడతారు. మినిమం గ్యాప్స్ లో కొడతారు.

ఇలా చేయడం వల్ల ముఖానికి రక్తప్రసరణ బాగా జరిగి చర్మం నిగారింపునిస్తుందని ఈ దేశం అమ్మాయిలు నమ్ముతారు. పైగా ముఖంలో ఉన్న ఎముకలు కూడా సర్దుబాటు అయి, ఫేస్ ఓ మంచి షేప్ లోకి వస్తుందని చెబుతున్నారు. అయితే ఇది సింగిల్ సిట్టింగ్ తో పూర్తయ్యే థెరపీ కాదు, చర్మం తత్వంపై ఈ సిట్టింగ్స్ ఆధారపడి ఉంటాయి.

దక్షిణ కొరియాలో కొన్నేళ్లుగా పురుషులకు కూడా అందంపై ఆకాంక్ష పెరిగింది. దీంతో ఇప్పుడు పురుషులు కూడా ఈ చెంప దెబ్బల ట్రీట్ మెంట్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.