కొడాలి నాని పంచ్ లతో శుక్రవారం సోషల్ మీడియా అదిరిపోయింది. ఉమక్కయ్యా అంటూ ఆయన వేసిన సెటైర్లు ఓ రేంజ్ లో పేలాయి. దీంతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా జీవిత చరిత్ర అంతా తవ్వి తీశారు కొడాలి నాని. వసంత నాగేశ్వరరావు లాంటి నేతల్నే ఢీకొన్నానని చెప్పుకునే ఉమా అసలు పూర్వాశ్రమంలో ఏంచేశారో చెబుతా వినండి అంటూ సోడా హిస్టరీ బయటకి తీశారు.
దేవినేని ఉమా తండ్రికి కూల్ డ్రింక్ షాప్ ఉండేదని, ఆయన సోడాలు నింపుతుంటే, ఉమా.. సోడా బుడ్డిలను కడుగుతూ సాయం చేసేవారని చెప్పుకొచ్చారు. తనని లారీ డ్రైవర్, లారీ క్లీనర్ అని విమర్శిస్తున్న ఉమా.. మైసూర్ ప్యాలెస్ నుంచి ఏమైనా ఊడిపడ్డారా, సోడా షాప్ లోనే కదా పెరిగి పెద్దయింది అని గుర్తు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యాయి. ప్రధాన మీడియా కూడా ఆయన ఇంటర్వ్యూలను బిట్లు బిట్లుగా కట్ చేసి పదే పదే చూపించేది. ఈ 14నెలల్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు ఒక ఎత్తయితే ఈ సారి పెట్టిన చాకిరేవు మరింత ఎక్కువగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో సోడా స్టోరీ ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్ బుక్ పోస్టులన్నీ ఈ సోడా కాన్సెప్ట్ పైనే ఫోకస్ పెట్టాయి. పాత సినిమాల్లో సోడా పాటలన్నీ బైటకొచ్చాయి. సినిమాల్లో సోడా బుడ్డి సీన్లన్నీ కట్ చేసి మరీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఒక్కసారిగా ఎం.ఎస్.నారాయణ అందరికీ గుర్తొచ్చారు. బన్నీ సినిమాలో ఎం.ఎస్. నారాయణ తండ్రీ కొడుకులుగా సోడా బండి నడిపే సీన్ ని ప్రతి ఒక్కరూ సెటైరిక్ గా పోస్ట్ చేశారు.
దీంతో పాటు పద్మనాభం సోడా పాట, జూనియర్ ఎన్టీఆర్ సోడా బుడ్డి పాట.. ఒకటేంటి.. బ్లాక్ అండ్ వైడ్ కాలం నుంచి లేటెస్ట్ సినిమాల వరకు చాలా ఓపిగ్గా వెదికి మరీ సోషల్ మీడియాని వైసీపీ సోడా బుడ్డి సీన్లతో నింపేసింది. దేవినేని ఉమాని కొడాలి అలా సెటైర్ వేసి వదిలి పెడితే.. వైసీపీ కార్యకర్తలు మాత్రం విపరీతంగా ట్రోల్ చేసి వదిలారు.