అతి పెద్ద తప్పు చేసిన సోనూ సూద్

రాజయోగం నెత్తిపై తాండవం ఆడుతుంటే పిలిచి మరీ శనిదేవుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడట ఒకరు. ఆ ఒక్కరే సోనూ సూద్ అని ఇప్పుడు టాక్. అవును… లాక్ డౌన్ హీరోగా సోనూ సూద్ కి…

రాజయోగం నెత్తిపై తాండవం ఆడుతుంటే పిలిచి మరీ శనిదేవుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడట ఒకరు. ఆ ఒక్కరే సోనూ సూద్ అని ఇప్పుడు టాక్. అవును… లాక్ డౌన్ హీరోగా సోనూ సూద్ కి మంచి పేరుంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తారు. కొన్ని భారీ ఆఫర్లు కూడా తనకు వచ్చినట్టు ఆమధ్య సోనూ స్వయంగా ప్రకటించాడు కూడా. 

తనకు రాజకీయాలు ఆసక్తి లేదన్నాడు సరే, కనీసం తన చెల్లెలు పోటీ చేసే పార్టీ అయినా సోనూ సూద్ కరెక్ట్ గా ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు చాలామంది. పోయి పోయి కాంగ్రెస్ తో చేతులు కలిపి సోనూ తన చెల్లెలి పొలిటికల్ కెరీర్ నాశనం చేశారని, తాను కూడా డైలమాలో పడిపోయారని అంటున్నారు.

సోనూ సూద్ కి గతంలో బీజేపీ గాలం వేసింది. కానీ పడలేదు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మంచి పోస్ట్ ఇచ్చింది. ఆ ఊపులో ఆయన కేజ్రీవాల్ కి జై కొట్టినా సరిపోయేది. కానీ నేరుగా పంజాబ్ కి వచ్చి కాంగ్రెస్ తో దోస్తీ కట్టారు. 

తన చెల్లెల్ని కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయించారు. పంజాబ్  అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దారుణంగా ఓడిపోయింది. ఆయన్ను దగ్గరకు తీసుకోవాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. దీంతో సోనూ ఆలోచనలో పడిపోయారు.

బీజేపీతో కలిసినా..

సోనూ సూద్ బీజేపీతో కలిసినా బాగుండేదేమోనని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచింది. పోనీ బీజేపీ తరపున ఆయన చెల్లెలు పోటీ చేసి ఓడిపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ దక్కేది. 

కనీసం సోనూ సూద్ ప్రచారం చేసి ఉంటే ఆయన పరపతి కూడా పెరిగి ఉండేది. పోనీ ఢిల్లీలో తనకి పిలిచి ఆఫర్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ తరపున తన చెల్లెల్ని బరిలో దించినా పరువు దక్కేది. పంజాబ్ కేబినెట్ లో ఆమెకు చోటు కూడా దక్కేదేమో.

కానీ సోనూ సూద్ పెద్ద మిస్టేక్ చేశారు. అందివచ్చిన రెండు అవకాశాల్ని వదిలేసుకున్నారు. అస్సలు ఏమాత్రం స్కోప్ లేని కాంగ్రెస్ తో జత కట్టారు.

రాజకీయాల్లో వ్యక్తిగత ప్రాభవం ఏమాత్రం పనిచేయదని సోసూనూద్ విషయంలో మరోసారి రుజవైంది. సోనూ సూద్ పరోక్షంగా ఇచ్చిన పొలిటికల్ ఎంట్రీ ఫ్లాప్ షో గా మిగిలింది. ఆఫర్లు వచ్చి కూడా సోనూ తిరస్కరించడం, పోయి పోయి ఓడిపోయే పార్టీ టికెట్ సంపాదించి చెల్లెలి ఓటమికి కారణం అవడంతో.. సోనూ సూద్ పై అందరూ సింపతీ చూపిస్తున్నారు.