రామతీర్ధంలో ఆధ్యాత్మిక పండుగ

రాముడు ఉన్న కోవెలకు ఎవరూ వెల కట్టలేరు. రామ భక్తిని కూడా ఎవరు  తక్కువ చేసి చూడలేరు. రాముడు దేవుడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన సకల లోకాలకు రక్షకుడు.  Advertisement ఆ రాముడి పేరిట…

రాముడు ఉన్న కోవెలకు ఎవరూ వెల కట్టలేరు. రామ భక్తిని కూడా ఎవరు  తక్కువ చేసి చూడలేరు. రాముడు దేవుడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన సకల లోకాలకు రక్షకుడు. 

ఆ రాముడి పేరిట రాజకీయాలు చేయాలనుకోవడం తప్పే. అయినా రామతీర్ధంలో ఈ మధ్య దాకా రాజకీయం రంజుగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం సత్వరం తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగా రామతీర్ధం ఇపుడు ఆ రొచ్చు నుంచి తొందరగానే బయటపడింది.

తిరుపతి నుంచి తయారు చేసిన సీతాలక్ష్మణ సమేత రాముల వారి విగ్రహాల ఊరేగింపులో రామతీర్ధం భక్త జనం అన్నీ మరచి పాలు పంచుకున్నారు. అక్కడ రామ భక్తి తప్ప మరేమీ కనిపించలేదు.

ఇక ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు రామతీర్ధం లో యజ్ఞయాగాదులు, జపతపాలతో పూర్తిగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. ఆ మీదట 28న బాలాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా శాస్తోక్తంగా జరుగుతుంది. 

ఇక మరో ఏడాది వ్యవధి లో బోడి కొండ మీద కోడండ రామాలయం పునరుద్ధరణ పనులు  పూర్తి అవుతాయి. మొత్తానికి రాములోరి వైభోగాన్ని చూసి ఆస్తిక జనులు తరిస్తున్నారు. మధ్యలో రాజకీయాలు చేసిన వారే రావణులుగా మిగిలిపోతారు. అంతే.

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!

మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!