ఈనాడు-నిమ్మగడ్డ-చంద్రబాబు.. ఓ గూడు పుఠానీ

నిమ్మగడ్డ కోర్టుకి ఏం చెబుతున్నారనే విషయం ముందు రోజే ఈనాడుకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.  Advertisement ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్ట్ లో నిమ్మగడ్డ అఫిడవిట్…

నిమ్మగడ్డ కోర్టుకి ఏం చెబుతున్నారనే విషయం ముందు రోజే ఈనాడుకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. 

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్ట్ లో నిమ్మగడ్డ అఫిడవిట్ సమర్పించిన విషయం అదే రోజు ఈనాడులో బ్యానర్ ఐటమ్ గా వచ్చిందంటే.. ముందురోజే దానిపై నిమ్మగడ్డ ఉప్పందించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు స్క్రీన్ ప్లే వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన కోర్టుని ఇలా మోసం చేసిన నిమ్మగడ్డ ఇక ఎన్నికలను ఎలా సజావుగా జరుపుతారని ప్రశ్నించారు. 

ప్రభుత్వంపై లేఖలు రాస్తూ విమర్శలు చేసిన వ్యక్తి.. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానాన్ని శ్రీకాంత్ రెడ్డి వ్యక్తం చేశారు. 

3 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన కమిషనర్.. రోజుకి 3వేల కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు ఎలా జరుపుతారని, ఎన్నికల సిబ్బంది ప్రాణాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.

వ్యవస్థల్లోని లోపాలను సీఎం జగన్ రిపేర్ చేయాలని చూస్తుంటే.. వాటిని అడ్డం పెట్టుకుని ఇంకా కుట్రలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. 

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి పనుల్ని చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలంటే ఎప్పుడూ భయపడదని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా విజయం తమకు నల్లేరుపై నడకేనని అన్నారు. 

2019 ఎన్నికల సమయంలో అప్పటి ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేదిని చంద్రబాబు ఎలా బెదిరించారో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి ఇప్పుడు నిమ్మగడ్డను వెనకేసుకు రావడం హాస్యాస్పదం అని అన్నారు.

నోరు తెరిస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే బాబుకి రాజకీయాల్లో ఉండాల్సింది అనుభవం కాదని, హుందాతనం అని గుర్తు చేశారు శ్రీకాంత్. చంద్రబాబు దోపిడీకి పోలవరమే ప్రత్యక్ష ఉదాహరణ అని.. కాంట్రాక్ట్ లు, కమీషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. 

సంక్రాంతికి టిడ్కో ఇళ్లు స్వాధీనం చేసుకోండని చంద్రబాబు చెబుతున్నారని, అలా స్వాధీనం చేసుకోడానికి వెన్నుపోటు పొడవటానికి అది తెలుగుదేశం పార్టీ కాదని గుర్తు చేశారు. 

అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు కట్టి, రూ.3200 కోట్లు బకాయి పెట్టి బాబు గద్దెదిగి వెళ్లిపోయారని అన్నారు. కోర్టుల్లో కేసులు వేసి, పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్న వ్యక్తికి హౌసింగ్ స్కీమ్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు శ్రీకాంత్ రెడ్డి.  

బాబు జూమ్ సౌండుకి, వైసిపీ నో రీసౌండ్