అచ్చెన్నతో ఆరంభం?

ఉత్తారాంధ్రాలో మూలన విసిరేసినట్లున్న శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో మొదటి జిల్లా. ఇపుడు అక్కడ నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఓడిన తరువాత ఆ పార్టీకి, చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి…

ఉత్తారాంధ్రాలో మూలన విసిరేసినట్లున్న శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో మొదటి జిల్లా. ఇపుడు అక్కడ నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఓడిన తరువాత ఆ పార్టీకి, చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు.

ఇది ఆరంభం మాత్రమేనా అన్న చర్చ సాగుతోంది. దీనికి కొద్ది గంటల ముందు రాష్ట్ర మంత్రివర్గం చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో అవినీతి కార్యక్రాలపైన సీబీఐ విచారణ జరిపించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇపుడు ఏసీబీ కూడా దూకుడు పెంచింది. అచ్చెన్న అరెస్ట్ తో టీడీపీ వర్గాల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరగలేదని ఎవరూ గుండె మీద చేయి వేసుకుని చెప్పలేరు.

దాంతో వివిధ కీలక శాఖలను చూసిన మాజీ మంత్రులతో పాటు, నాడు కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలు,నాయకులు కూడా అచ్చెన్న అరెస్ట్ తో ఆందోళనకు గురి అవుతున్నారు.

ఓవైపు సీబీఐ విచారణకు ఆదేశించడం, మరో వైపు ఏసీబీ జూలు విదిలించడంతో పచ్చ పార్టీ తమ్ముళ్ళలో కంగారు  మొదలైదని అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు సినిమా చూపిస్తారని మరో వైపు వైసీపీ వైపు నుంచి హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అచ్చెన్న అరెస్ట్ అనూహ్యమనే చెప్పాలి.

అమరావతి అక్రమాలపై ఇంకా అరెస్టులు జరుగుతాయి

నువ్వు ఎలాంటోడివో మీ అబ్బాయే చెప్పాడు