విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులైన తరువాత విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్నారు. గత కొన్నేళ్ళుగా ఆయన విశాఖలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థానిక సమస్యలపైన పెద్దల సభలో పోరాడుతున్నారు.
ఇక ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఆయన మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇపుడు పాలనారాజధానిగా విశాఖను ప్రకటించడంతో ఇంకా బాధ్యత పెరిగింది.
దాంతో ఆయన విశాఖ భూములు రాజకీయ రాంబందుల పాలు కాకుండా చూడడమే కాదు అధికారులకు కచ్చితమైన ఆదేశాలే జారీ చేస్తున్నారు.
ఈ విషయంలో తన పర భేదం లేకుండా ఎవరినైనా వదిలిపెట్టవద్దు అని ఆయన పక్కా క్లారిటీగా చెప్పడం కూడా చాలామంది రాజకీయ జీవులకు గిట్టడంలేదు. అందులో వారూ వీరూ కూడా ఉన్నారు.
మొత్తానికి ఎవరేమనుకున్నా సరే విశాఖలో గజం జాగా కూడా అన్యాక్రాంతం కాకూడదని విజయసాయిరెడ్డి ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
దీని మీద ఎవరైనా ఎంతటి వారైనా ఒక్కటే సమాధానం అన్నట్లుగా కొనసాగిస్తున్న ఆయన దూకుడు ప్రత్యేకించి విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోందని చెప్పాలి.