ఏపీలో బీజేపీ సత్తా చూపిస్తామంటున్న సుజనా…?

ఆయన రాజకీయ పుట్టుక టీడీపీ, రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం అయితేనేమి, కేంద్రంలో మంత్రి పదవీ భాగ్యం దక్కిదేతేమి అదంతా టీడీపీ పుణ్యమే. అలాంటి సుజనా చౌదరి రెండేళ్ల క్రితమే బీజేపీలో చేరారు. Advertisement…

ఆయన రాజకీయ పుట్టుక టీడీపీ, రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం అయితేనేమి, కేంద్రంలో మంత్రి పదవీ భాగ్యం దక్కిదేతేమి అదంతా టీడీపీ పుణ్యమే. అలాంటి సుజనా చౌదరి రెండేళ్ల క్రితమే బీజేపీలో చేరారు.

నాటి నుంచి ఆయన కరడు కట్టిన బీజేపీ నేతల కంటే ఎక్కువగానే కాషాయ నేతగా మారిపోయారు. ఆయన ఏపీలో విపక్షంగా ఒక వైపే చూస్తారని పేరు. అదే వైసీపీని టార్గెట్ చేయడం. ఆయన మనసు ఇప్పటికీ టీడీపీ వైపు ఉందని ఎవరైనా అనుకోవచ్చు కాక తాను మాత్రం ఫక్తు బీజేపీయే అని  అంటారు. ఆయనే బీజేపీ ఎంపీ  సుజనా చౌదరి.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని కూడా సుజనా చౌదరి. గట్టి సవాల్ చేశారు. ఏపీలో బీజేపీ ఏపీలోకి అధికారంలోకి వస్తుందని సుజనా చౌదరి మాటలను బట్టి అనుకోవచ్చేమో. సత్తా చూపిస్తామంటే పవర్ ని అందుకోవడమే కదా.

ఆ మాటకు వస్తే ఏపీలో టీడీపీ బీజేపీ కంటే వెనకబడాలి. వైసీపీని బీజేపీ మించిపోవాలి. ఇవన్నీ రానున్న ముప్పయి నెలల్లో తప్పక జరుగుతాయని సుజనా చెప్పుకొచ్చారు. విశాఖలో వాజ్ పేయి జయంతి వేళ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కీలక కామెంట్స్ చేశారు.

ఏపీలో గత ముప్పయి నెలలలో వైసీపీ పాలన దశా దిశా లేకుండా సాగిందని సుజనా ఘాటుగా విమర్సించారు. అంతే కాదు ముప్పయ్యేళ్ల వెనక్కి ఏపీ వెళ్ళిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏమీ వైసీపీ అడగలేకపోతోంది అంటే ఆ పార్టీ నేతల లొసుగులే కారణమని తేల్చేశారు సుజనా చౌదరి.

ఆ మాటను పక్కన పెడితే ఏపీకి కేంద్రం చాలా ఇవ్వాలని, ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది అన్న సంగతిని సుజనా పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా అన్న ప్రశ్న అయితే జనాల నుంచి  వస్తోంది. అదే సమయంలో రాష్ట్రం కోరకపోయినా కేంద్రం తాను ఇవ్వాలనుకుంటే ఏపీకి ఇవ్వవచ్చు కదా, సుజనా చౌదరి లాంటి వారు ఏపీ ప్రయోజనాల‌ కోసం కేంద్రంపైన వత్తిడి తెచ్చే పని చేయవచ్చు కదా అన్న మాటా వస్తోంది. మొత్తానికి ఏపీలో బీజేపీకి అధికారం ఖాయమని సుజనా అనకుండానే సత్తా చూపుతామని చెప్పడమే విశేషం.