ఏ పార్టీలోనూ చేరేది లేదన్న నటీమణి!

మండ్య నుంచి ఎంపీగా నెగ్గిన తెలుగునటి, కన్నడింటి కోడలు సుమలత తన రాజకీయ పయనంపై స్పందించారు. తను ఇండిపెండెంట్ ఎంపీగానే కొనసాగాలని అనుకుంటున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరతారు అని…

మండ్య నుంచి ఎంపీగా నెగ్గిన తెలుగునటి, కన్నడింటి కోడలు సుమలత తన రాజకీయ పయనంపై స్పందించారు. తను ఇండిపెండెంట్ ఎంపీగానే కొనసాగాలని అనుకుంటున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరతారు అని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో ఆమెకు బీజేపీ మద్దతు కూడా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న, కర్ణాటకలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకున్న బీజేపీలోకి చేరతారనే ప్రచారం జరిగింది. తరచూ బీజేపీ నేతలతో ఆమె సమావేశం అవుతూ వచ్చారు. దీంతో ఆ విషయంలో మరింత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని సుమలత ఖండించారు.

తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని, తన భర్త అంబరీష్ చివరి వరకూ కొనసాగిన పార్టీ కాంగ్రెస్ లోకి కానీ చేరే ఉద్దేశం లేదని ఆమె స్పష్టంచేశారు. ఇండిపెండెంట్ గానే కొనసాగబోతున్నట్టుగా తెలిపారు.

పీవీపీ వర్సెస్ బండ్ల ఏది నిజం? ఏది అబద్దం?