వల్లభనేని వంశీ ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. నారా భువనేశ్వరికి క్షమాపణ చెప్పడం ద్వారా ఆయన మళ్లీ మీడియా ఫోకస్ ను తనవైపు తిప్పుకున్నారు. కొన్నాళ్లుగా వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు వార్తల మీద వార్తలను పుట్టిస్తూ వస్తున్నాయి.
అసెంబ్లీలో ఇవే వ్యాఖ్యలు దుమారం లేపాయి. దాంతో చంద్రబాబు ఫస్ట్ టైమ్ భొరుమని ఏడ్చారు. ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసారు.
ఆ తరువాత కూడా వల్లభనేని వంశీ వెనక్కు తగ్గలేదు. కమ్మ సామాఙిక వర్గం మొత్తం వల్లభనేని వంశీ, కొడాలి నానిలను బహిష్కరించినంత పని చేసారు. ఇలాంటి నేపథ్యంలో కమ్మ సామాఙిక వర్గ పిక్నిక్ లో ఓ కార్పోరేటర్ తన విరాళం 50 లక్షలు ప్రకటించారు.
వల్లభనేని వంళీ, కొడాలి నానిలతో పాటు, కాపు సామాఙిక వర్గానికి చెందిన అంబటి రాంబాబులను తుదముట్టించడానికి ఇది తన వంతు విరాళం అని బాహాటంగా ప్రకటించారు.
నిఙానికి ఇంకెవరైనా ఇలా చేసి వుంటే ఈ పాటికి ఏదో విధంగా విషయం కోర్టు దగ్గరకు పోయేది. కానీ ఙనాలంతా లైట్ తీసుకున్నట్లున్నారు.
అయితే వల్లభనేని వంశీ మాత్రం ఆ విడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే భువనేశ్వరికి క్షమాపణ చెప్పడం విశేషం.
తను అలా మాట్లాడి వుండకూడదని ఆయన అన్నారు. తను భువనేశ్వరిని అక్కా అని పిలిచేవాడిని అని చెప్పుకున్నారు.