సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నిర్భయ దోషి అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తాను వినని ఆయన తేల్చి చెప్పారు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ రివ్యూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి బాబ్డే తప్పుకున్నారు.
దీంతో రివ్యూ పిటిషన్ కొత్త మలుపు తిరిగింది. రివ్యూ పిటిషన్ విచారణకు కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. బాబ్డే తప్పుకోవడం వెనుక కారణం లేకపోలేదు. బాబ్డే కోడలు గతంలో నిర్భయ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో స్వయాన తన కోడలు విచారించిన కేసుకు సంబంధించి వాదనలు వినడం నైతికంగా సరైంది కాదని ఆయన భావించారు. అందువల్లే తాను ఆ కేసు వినే ప్రశ్నే లేదని, అలాంటప్పుడు తీర్పు చెప్పే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో దాఖలైన అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండింది. అయితే సుప్రీం చీఫ్ జస్టిస్ అనూహ్య నిర్ణయం కారణంగా కొత్త బెంచ్ ఏర్పాటు, బాబ్డే స్థానంలో సీనియర్ న్యాయమూర్తి నియామకం తదితర కారణాల రీత్యా బుధవారం వాదనలు జరగనున్నాయి. ఇదే రోజు తీర్పు కూడా వెల్లడించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇదే కేసులో దోషులైన ముగ్గురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అక్షయ్ విషయం తేలితే ఉరిపై స్పష్టత వస్తుంది. అందువల్లే దేశం యావత్తు అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్‌పై సుప్రీం వెలువరించే తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
నిర్భయ కేసులో సుప్రీం చీఫ్ జస్టిస్ అనూహ్య నిర్ణయం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నిర్భయ దోషి అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తాను వినని ఆయన తేల్చి చెప్పారు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ రివ్యూ…
Advertisement