కరోనా సెకెండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోతోందనుకుని భారతావని ఊపిరి తీసుకుంటున్న సమయం. కానీ మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తానని మహమ్మారి సంకేతాలు పంపుతోందనే అనుమానాలు.
దేశంలో కరోనా కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఇది స్వల్పమే అయినప్పటికీ, పెరుగుదల అనేది ఆందోళన కలిగిస్తోంది. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడిచేసరికి అవి 39 వేలు దాటడం సర్వత్రా ఆందోళన. అలాగే కరోనా కేసుల పెరుగుదల చర్చకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి.
శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 491 మంది మృతి చెందారు. అలాగే గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 442 కేసులు ఎక్కువ నమోదయ్యాయి. 43,910 మంది బాధితులు కరోనా నుంచి బయట పడ్డారు. ఈ గణాంకాలు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజురోజుకూ కరోనా కేసుల నమోదు తక్కువ అవుతుందని ఆశిస్తున్న వాళ్లకు తాజా లెక్కలు ఆందోళన కలిగించకుండా ఉండవు. ఎందుకంటే ఒకవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నాయి. మహమ్మారి కేసుల పెరుగుదల నేపథ్యంలో థర్డ్ వేవ్ ఏమైనా ప్రారంభమ వుతున్నదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా కరోనా కేసుల పెరుగుదల పలు అనుమానాలు, భయాందోళనలకు కారణమ వుతోందన్నది వాస్తవం.