కుహనా హిందుత్వవాదులకు స్వామి వార్నింగ్

అడ్డ బొట్టూ నిలువు బొట్టొ పెట్టుకుంటే అపర హిందూత్వలకు ప్రతీకలు అయిపోరు. దేవుడి భూములనే కబ్జా చేస్తూ అదే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు తెరలేపితే చేసిన  తప్పులు ఒప్పు అయిపోవు. ఇక తామే…

అడ్డ బొట్టూ నిలువు బొట్టొ పెట్టుకుంటే అపర హిందూత్వలకు ప్రతీకలు అయిపోరు. దేవుడి భూములనే కబ్జా చేస్తూ అదే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు తెరలేపితే చేసిన  తప్పులు ఒప్పు అయిపోవు. ఇక తామే హిందూత్వానికి కేరాఫ్ అడ్రస్ అంటూ తెగ రెచ్చిపోతున్న కుహనా హిందూత్వ నేతలకు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

హిందుత్వం అంటే అర్ధం తెలియని వారు కూడా నిష్టగా దశాబ్దాల తరబడి హిందూమంతాన్నే నమ్ముకుని ఎన్నో పోరాటాలు చేసిన శారదాపీఠంపై సామాజిక మాధ్య‌మాలలో తప్పుడు రాతలు, కూతలు కూస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు.

దేశంలో  హిందూత్వం కోసం, భారతీయ ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ దేవుడి కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్న చరిత్ర శారదాపీఠానికి ఉందని స్వామీ అంటున్నారు. ఇవాళ కొత్తగా పుట్టుకువచ్చిన్ కుహనా హిందూత్వ నాయకులు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని కూడా హెచ్చరిస్తున్నారు.

నిజానికి టీటీడీ భూముల విషయంలో స్వామి ప్రభుత్వ పెద్దలకు చెప్పాల్సింది చెప్పారు. అయినా సరే ఆయన మీద శారదాపీఠం మీద ఇదే అదను అని సోషల్ మీడియాలో  బురదజల్లుడు కార్యక్రమానికి కొత్తగా హిందూ మతం పుచ్చుకున్న వారు దిగిపోతూంటే సహించడం కష్టమే కదా.

అందుకే ఇలాంటివి చేస్తే న్యాయస్థానాలకు కూడా వెళ్ళి ఫిర్యాదు చేయాల్సివుంటుందని స్వామి మండిపడుతున్నారు. శారదాపీఠానికి హిందూ ధర్మమే సర్వం సహా తప్ప మరేమీ కాదని కూడా చెబుతున్నారు.  తామే హిందూ ధర్మానికి కొత్త పెత్తందార్లుగా చెప్పుకుంటున్న నాయకుల భక్తి దేవుడి మీద కాదు, ప్రసాదం మీదనే అన్న సంగతి అందరికీ తెలిసిందే.

అందుకే వారి విమర్శలు, రాజకీయాలు కూడా రూట్ మారిపోయి రాంగ్ ట్రాక్ లో పడుతున్నాయి. అయినా తాము పవర్లో ఉన్నపుడు చేయాల్సిన అపచారాలన్నీ చేసేసి ఇపుడు పెద్దగా గావుకేకలు పెడితే హిందువులంతా నమ్మేస్తారా. పిచ్చితనం కాకపోతేనూ.

మన పాలన-మీ సూచన, 2వ రోజు