విడాకులు తీసుకున్న స్వాతి

త‌న భ‌ర్త‌తో స్వాతి విడాకులు తీసుకున్నారు. ‘మీటూ’ ఉద్యమ సమయంలో స్వాతి భర్త .. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి వాళ్లిద్ద‌ని మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అది…

త‌న భ‌ర్త‌తో స్వాతి విడాకులు తీసుకున్నారు. ‘మీటూ’ ఉద్యమ సమయంలో స్వాతి భర్త .. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి వాళ్లిద్ద‌ని మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అది కాస్త విడాకులకు దారి తీసింది. వారి విడాకుల వ్య‌వ‌హారం బుధ‌వారానికి ఒక కొలిక్కి వ‌చ్చింది. చ‌ట్ట‌బ‌ద్ధంగా వారిద్ద‌రూ నిన్న విడిపోయారు.

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతి మ‌లివార్ అంటే దేశ రాజ‌ధానిలో తెలియ‌ని వాళ్లు ఉండ‌రు. యాక్టివిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమె క్రియాశీల‌క నేత‌. స్వాతి దంప‌తులిద్ద‌రూ ఆప్‌లో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆప్ హ‌ర్యానా క‌న్వీన‌ర్‌గా స్వాతి భ‌ర్త న‌వీన్ జైహింద్ (39) కొనసాగుతున్నారు.

సామాజిక స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం చేసే స్వాతి మలివాల్‌ దేశంలోనే అత్యంత చిన్న‌న వయసులో మహిళా కమిషన్‌ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్ప‌డం విదిత‌మే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ఆమె ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా త‌మ వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగం  సందేశాన్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్‌ఎస్‌ కాలేజీలో ఐటీలో స్వాతి డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె కీల‌కంగా ప‌నిచేశారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు  నవీన్‌ జైహింద్‌తో పరిచయం ఏర్ప‌డింది. ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీసింది. కొంతకాలం వాళ్లిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేశారు.  ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అనంత‌ర కాలంలో   అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో దంప‌తులిద్ద‌రూ చేరారు.

పార్టీ హర్యానా విభాగానికి నవీన్‌ కన్వీనర్ అయ్యారు. ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన స్వాతికి నిరాశే ఎదురైంది. దీంతో స్వాతికి మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవి దక్కింది.  మహిళల సమస్యల పరిష్కారానికి ప‌ట్టుద‌ల‌, చిత్త‌శుద్ధితో కృషి చేస్తార‌నే పేరు పొందారు. పోక్సో చట్టం రావడం వెనుక ఆమె శ్ర‌మ దాగి ఉంది.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్