Advertisement

Advertisement


Home > Politics - Gossip

ముస్లింలకు భరోసా ఇస్తున్న జగన్ సర్కార్

ముస్లింలకు భరోసా ఇస్తున్న జగన్ సర్కార్

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక అంశాలపై ఆందోళనలు నడుస్తున్నాయి. మోడీ సర్కారుకు, వ్యతిరేకించే విపక్షాలకు మధ్య తీవ్రమైన మాటల యుద్ధమే  నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్నార్సీ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని మోడీ ఢంకా బజాయించి చెబుతున్నారు. సీఏఏ వలన ఏ పౌరుడికి ఇబ్బంది వస్తుందో చెప్పాలంటూ.. భాజపా ప్రభుత్వాలు సవాళ్లు విసురుతున్నాయి. ఇలాంటి సంక్లిష్ట నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన రెడ్డి సర్కారు మాత్రం ముస్లిములకు భరోసా ఇస్తోంది. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అమలు చేయనివ్వబోమని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.

సజ్జల విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. సీఏఏ విషయంలో జగన్ ప్రభుత్వం పార్లమెంటుల్లో బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత.. ఎన్నార్సీ విషయంలో కూడా వారిపై రకరకాల అనుమానాలు రేగాయి. పైగా, మోడీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగడానికి చూస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఏఏ, ఎన్నార్సీ విషయంలోనూ మోడీ కి వంత పాడే విధంగా వైకాపా ధోరణి ఉంటుందనే పుకార్లు వచ్చాయి. అయితే ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల అలాంటి ఊహాగానాలను కొట్టి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అనుమతించేది ఉండదని అన్నారు.

ఇప్పటికే సీఏఏ, ఎన్నార్సీలను పలురాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వీటిని వ్యతిరేకించారు. తదుపరి సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం అని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకోనున్నదనే చర్చ వచ్చింది.

అయతే సజ్జల ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ ఇప్పటికే పార్లమెంటులో సీఏఏ కు మద్దతివ్వడాన్ని కూడా సమర్థించుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన బిల్లుగా పేర్కొన్నందువల్లనే ఆ బిల్లుకు మద్దతిచ్చామని.. వైకాపా పార్టీలోనే అంతర్భాగం అయిన ముస్లిం మైనారిటీలు రాష్ట్రంలో అభద్రతకు గురవుతున్న ప్రస్తుత తరుణంలో.. దాన్ని మాత్రం అనుమతించేది లేదని అంటున్నారు. మరి మోడీ సర్కారు కూడా ఎన్నార్సీ విషంయలో చాలా పట్టుదలగా ఉన్నందున.. రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాల మధ్య కొత్త ప్రతిష్టంభనకు ఇది దారితీస్తుందేమో చూడాలి.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?