తబ్లిగీ మర్కద్ లో ప్రార్థనలకు అంటూ వెళ్లి దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అయిన వారి విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఇలాంటి ప్రార్థనలు ఎలా జరిగాయి? ఇవి అనుమతి లేకుండా జరిగినవని స్పష్టం అవుతూనే ఉంది. విజిటింగ్ వీసాల మీద ఇండియాకు వచ్చి కొంతమంది ఇక్క మత ప్రచారాలు చేస్తున్న వైనం బయటకు వచ్చింది. ఇంత విపత్కర పరిస్థితుల్లో కానీ ఇలాంటి పరిస్థితులు బయట పడకపోవడం దేశంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి చాటుతూ ఉంది.
ఆ సంగతలా ఉంటే.. తబ్లిగీ వాళ్లు తెలిసి చేయలేదనే సానుభూతి కొంత వ్యక్తం అవుతూ ఉంది. అయితే అక్రమంగా ఇక్కడకు వచ్చి మత ప్రచారాలు, బోధనలు చేసే వాళ్లను కలవడమే పెద్ద తప్పు! వాళ్లు మత ప్రచారం చేయడానికి అంటూ వీసాలు తీసుకుని ఇక్కడకు రాలేదు. విజిటింగ్ వీసాల మీద వచ్చి అలాంటి పనులు చేయడాన్ని ఏ మతం అయినా ఎలా సమర్థిస్తుంది?
ఇక తబ్లిగీ మసీదులో ఉన్న పరిస్థితుల గురించి బీబీసీ కథనం చదివితే వాంతులు రావాల్సిందే. చిన్న మసీదులో వేల మందిని పెట్టి కరోనా వ్యాప్తికి తబ్లిగీ చాలా కృషి చేసిన వైనం బీబీసీ వివరించింది. ఆ సంగతలా ఉంటే.. తబ్లిగీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి మూర్ఖత్వం, రాక్షసత్వం ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
ఢిల్లీలోని ఒక క్వారెంటైన్ సెంటర్లో ఉన్న ఈ తబ్లిగీ గ్యాంగ్ అక్కడ వికృత చర్యలకు పాల్పడుతూ ఉందని తెలుస్తోంది. ఎంత దారుణంగా అంటే.. వీళ్లు బాటిల్స్ లోకి మూత్రం పోసి బయటకు విసురుతున్నారట! వీళ్లను కంట్రోల్ చేయడం కష్టం అవుతోందని, వీరికి సేవలనందిస్తున్న వైద్య సిబ్బంది వాపోతూ ఉంది. రోగం వచ్చి పోతారని.. అందరికీ అంటిస్తారని.. వీళ్లను అబ్జర్వేషన్లో ఉంచి, అన్నీ సమకూర్చుతూ ఉంటే.. అక్కడ ఇలాంటి అరాచకపనులకు పాల్పడుతూ ఉన్నారు తబ్లిగీ మూర్ఖులు.
కరోనాను వ్యాపింపజేయడానికే ఆ కిరాతకులు ఇలాంటి పనులు చేస్తున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. లోపలి నుంచి వాళ్లు విసిరిన మూత్రం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఆ పని చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నారట పోలీసులు. మరీ ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్లను ఏమనాలి అసలు?